`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ డౌటే!

Last Updated on by

ఎన్టీఆర్ జీవితంలో ల‌క్ష్మీ పార్వ‌తి ప్ర‌వేశించాక నంద‌మూరి కుటుంబంలో క‌ల్లోలం గురించి చూపిస్తున్నాన‌ని ఆర్జీవీ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్ రిలీజ‌వుతుందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ సినిమా రిలీజ్ ని నిలిపేయాల్సిందిగా ప‌లువురు కోర్టు గ‌డ‌ప తొక్క‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తెదేపా కార్యకర్త దేవీబాబు చౌదరి ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఈ చిత్రం ఉందని.. ఈ నెల 22న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆపాలని ఆయ‌న ఈసీని కోరారు. సినిమాలో సీఎం చంద్రబాబు పాత్రను విల‌న్ గా చూపించారని అది ఓటర్లపై ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 11 వరకు ఈ చిత్రం విడుదలను ఆపేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు కాపీని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపార‌ని తెలుస్తోంది. మొత్తానికి ఆర్జీవీ సినిమాపై ఇంత‌కాలం నంద‌మూరి కుటుంబీకులు ఎవ‌రూ స్ప ందించ‌లేద‌ని భావిస్తుంటే తేదేపా త‌ర‌పున నాయ‌కులు ఒక‌రొక‌రుగా బ‌రిలో దిగి నానా ర‌చ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు. మ‌రోవైపు వ‌ర్మ సైతం త‌న సినిమాపై కుట్ర జ‌రిగిందంటూ ప్ర‌త్యారోప‌ణ‌లు చేస్తూ సామాజిక మాధ్య‌మాల్లో వేడి పెంచ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Also Read: Kalank Has A Hangover Of Baahubali

User Comments