ఏపీలో మే 1న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్

ఎన్నో వివాదాల న‌డుమ ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ కు లైన్ క్లియ‌ర్ అయింది. మే 1న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్ల వ‌ర్మ కొన్ని గంట‌ల ముందే ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. వాస్త‌వానికి చిత్రాన్ని ఎన్నిక‌లు టార్గెట్ గా మార్చిలో రిలీజ్ చేయాల‌ని వ‌ర్మ ప్లాన్ స‌న్నాహాలు చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రిలీజ్ పై స్టే విధించాల‌ని కోర‌డంతో అనుమ‌తివ్వ‌లేదు. దీంతో ఏపీ మిన‌హా అన్ని చోట్ల `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ అయి సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది. ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కోణంలో సాగిన చిత్రానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మర‌థం ప‌ట్టారు.

అయితే ఇప్పుడు ఏపీలో రిలీజ్ అవుతుండ‌టంతో ఆ స్థాయి అంచ‌నాల‌ను థియేట‌ర్లో అందుకుంటాదా? అన్న‌ది సందేహ‌మే. ఎందుకంటే తెలంగాణ లో విడుద‌ల కావడంతో తెలుగు ప్రేక్ష‌కులు చాలా మంది సినిమాను వీక్షించారు. వివిధ మార్గాల ద్వారా సినిమాను మెజార్టీ పీపూల్స్ చూసేసారు. ఈ నేప‌థ్యంలో ఏపీలో సినిమా రిలీజ్ చేస్తారా? అనే సందేహాలు వ్య‌క్తం అయ్యాయి. కానీ వ‌ర్మ మాత్రం అవేం ప‌ట్టించుకోకుండా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ల‌క్ష్మీ పార్వ‌తి పాత్ర‌ను క‌న్న‌డ న‌టి య‌జ్ఞ శెట్టి, ఎన్టీఆర్ రోల్ ను రంగస్థల నటుడు విజయ్‌ కుమార్ పోషించిన సంగ‌తి తెలిసిందే.