29న `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్`..రాసిపెట్టుకొండి: వ‌ర్మ‌

Last Updated on by

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డింది. మార్చి 22న రిలీజ్ చేద్దామ‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేసినా సెన్సార్ ఆల‌స్యం కావ‌డం వ‌ల్ల వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది. దీనికి సంబంధించి సెన్సార్ తో వ‌ర్మ సంప్ర‌దింపులు జ‌రిపాడు. అటు టీడీపీ నేతలు, నాయ‌కులు ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ ఆపాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌లేదు. కేంద్ర రాష్ర్ట ఎన్నిక‌ల సంఘాలు సినిమా ఆపే హ‌క్కు త‌మ‌కు లేద‌ని తేల్చి చెప్పేసాయి. సెన్సార్ పై ఒత్తిడి తీసుకొచ్చింది టీడీపీ నాయ‌కుల‌ని రూమ‌ర్లు వ‌చ్చినా అందులో వాస్త‌వం లేద‌ని..వ‌ర్మ‌కు రాంగ్ సంకేతం వెళ్లింద‌ని అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

మ‌రి ఇంత‌కీ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్నిక‌లు ముందు రిలీజ్ ఉన్న‌ట్లా? లేన‌ట్లా? అంటే ఉన్న‌ద‌నే మ‌రోసారి వ‌ర్మ కండ‌బ‌ద్దలు గొట్టేసాడు. మార్చి 29న మా సినిమా క‌చ్చితంగా రిలీజ్ అవుతుంది. రాసి పెట్టుకొండి. ప‌క్కాగా వ‌చ్చేస్తున్నామంటూ కొద్ది సేప‌టి క్రిత‌మే ట్విట‌ర్ ద్వారా తెలిపాడు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పోస్ట‌ర్ పై రిలీజ్ డేట్ వేసి మ‌రి ప్ర‌చారానికి వదిలాడు. దీంతో మ‌రోసారి వ‌ర్మ పంతం నెగ్గించుకున్న వాడిగా ప్రూవ్ అయ్యాడు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మామ ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచి సిఎం కుర్చీ లాక్కొన్నారు! అనే పాయింట్ చుట్టూ ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలో క‌థ చెప్ప‌బోతున్నాడు వ‌ర్మ‌. మ‌రి క‌థ రిలీజ్ త‌ర్వాత ఎలాంటి వివాదాల‌కు దారి తీస్తుందోన‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Also Read: Lakshmi’s Ntr Got A New Release Date

User Comments