Last Updated on by
ఎన్టీఆర్ జీవితకథతో ఎన్బీకే కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు భిన్నంగా ఒరిజినాలిటీతో `లక్ష్మీస్ ఎన్టీఆర్` చిత్రం ఉంటుందని, ఎన్టీఆర్ `అసలు కథ` ఇదీ అంటూ ఆర్జీవీ చేస్తున్న హంగామా తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ లోని `మహానాయకుడు` చిత్రానికి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని బరిలో దించాలన్నది వివాదాల వర్మ ప్లాన్. ఆ క్రమంలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఇప్పటికే పలు వివాదాలు రచ్చకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోస్టర్, తొలి టీజర్ సహా ప్రతిదీ ఆకట్టుకున్నాయి. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని ఓ నటుడు ఎన్టీఆర్ గా అభినయించడం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి.
తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ ఆద్యంతం వర్మ మార్క్ మేకింగ్, స్టైలిష్ షాట్స్ తో మైమరిపించింది. ఎన్టీఆర్ లోని ఒరిజినాలిటీ తెరపై కనిపించబోతోందన్న భరోసాని ఈ ట్రైలర్ ఇచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించాక ఆ ఫ్యామిలీలో సంభవించిన కల్లోలం ఎలాంటిది? కుటుంబ కుట్రల కథేంటి? ఆ కుట్రలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత? అన్నది గుట్టు విప్పడంలో ఈ ట్రైలర్ పెద్ద సక్సెసైంది. ట్రైలర్ ఆద్యంతం మెరుపులు.. ఛమక్కులు.. ఎన్టీఆర్ జీవితాన్ని దగ్గరగా తరచి చూసినవారికి ఇదీ రియాలిటీ.. ఇదీ ఒరిజినాలిటీ అన్న తీరుగా ఆర్జీవీ ప్రతి ఫ్రేమును మలిచాడని అర్థమవుతుంది. 90లలో ఎన్టీఆర్ కుటుంబంలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని పూస గుచ్చే నాటి తరానికి ఈ ట్రైలర్ పెర్ఫెక్ట్ గా కనెక్టవుతుంది. అసలు కథ తెలియని నేటి తరం ముక్కున వేలేసుకునే కథ ఇదీ అని అర్థమవుతుంది. అసలు ఎన్టీఆర్ కుటుంబంలో వాస్తవంగా ఏం జరిగింది? అన్నది ఆర్జీవీ `లక్ష్మీస్ ఎన్టీఆర్`లో చూడొచ్చన్న భరోసా ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది.
నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని నమ్మడం!! అంటూ ఎన్టీఆర్ పళ్లు నూరే సీన్.. ధగా.. అంటూ లాంగ్ షాట్ లో చంద్రబాబును ఆవిష్కరించిన తీరు.. అతడు ఎన్టీఆర్ పాదాల్ని తాకుతూ ఎమోషన్ ని పలికించిన తీరు రియాలిటీతో చూపించాడు ఆర్జీవీ. లక్ష్మీ పార్వతి – ఎన్టీఆర్ ప్రేమకథలో కన్నీళ్ల కథను కొన్ని షాట్స్ లో అద్భుతంగా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ గాంభీర్యం.. బ్యాక్ గ్రౌండ్ లో రామ రామ రీసౌండ్ ట్రైలర్ కి గ్రిప్ ని పెంచాయి. నమ్మితేనే కదా ద్రోహం చేసేది- అడవి రాముడు డైలాగ్ ని ఆర్జీవీ తెలివాగా వాడేశారు వర్మ. జీవితం ఎప్పుడు ఎందుకు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు! అంటూ ఎన్టీఆర్ వినిపించిన డైలాగ్ ఆయన అనుభవాన్ని ఆవిష్కరిస్తుంది. ఈవిడ పేరు లక్ష్మీ పార్వతి.. మా జీవిత కథను రాస్తున్నారు..అంటూ పరిచయం.. శారీరక సుఖం కోసం కాదు అంటూ ఆ పెళ్లి వెనక పరమార్థాన్ని చెప్పించారు ఆ డైలాగ్ లో. “దానికి గానీ కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్!!“ అంటూ బాబు కుట్ర పూరితమైన డైలాగ్ ని .. మీరు నా పిల్లలు అయ్యి ఉండీ వాడితో చేరారా సిగ్గు లేకుండా! అంటూ తన పిల్లల్ని రామారావు ఛీదరించుకునే సన్నివేశం.. తమ్ముళ్లు వాడి మాట నమ్మకండి!! అంటూ పబ్లిక్ లో చెప్పు లు మీద పడిన సన్నివేశం.. ఇలా ప్రతిదీ మైండ్ బ్లోవింగ్ ఎమోషన్ తో సాగాయి. 1989లో ఎన్టీఆర్ ఓడిపోయిన తర్వాత సన్నివేశాల సమాహారాన్ని ఆర్జీవీ తెరపైకి తెచ్చారని ట్రైలర్ చెప్పింది. “మా జీవితాల్ని చెడగొట్టేందుకు దాపురించావే ముండా !“ అంటూ లక్ష్మీ పార్వతిపై రామారావు కుటుంబీకుల ఎటాక్ ని తెలివిగా చూపించారు. “హ్యాట్సాఫ్ చాలా గొప్పగా చెప్పారు!“ అంటూ మోమన్ బాబు ఎంట్రీ అదుర్స్. జీవీ ఫిలింస్ సమర్పణలో కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
User Comments