ట్రైల‌ర్ 2: ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సేష‌న్ క‌న్ఫామ్‌

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ .. అన్న‌గారు .. తారక రామారావు జీవితంలో అస‌లేం జ‌రిగింది? వాస్త‌వం ఏంటి? తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి లాక్కునేందుకు చంద్ర‌బాబు నాయుడు ఎలాంటి కుట్ర‌కు పాల్ప‌డ్డారు? ల‌క్ష్మీ పార్వ‌తిని చంద్ర‌బాబు, రామారావు కుటుంబీకులు ఎంత‌గా అస‌హ్యించుకున్నారు? ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి ప్ర‌వేశించాక ర‌గులుకున్న మంట‌లు ఎలాంటివి? ఆ ఘ‌ట్టంలో ఎన్టీఆర్ కుటుంబంలో ఒక్కొక్క‌రి ఎమోష‌న్ ఎంత‌? ఇలా ప్ర‌తిదానిని ఎంతో డీటెయిలింగ్ తో ఎలివేట్ చేసాడు ఆర్జీవీ అలియాస్ వివాదాల వ‌ర్మ‌.

తాజాగా రివీలైన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ 2 సంచ‌ల‌నాలు సృష్టిస్తూ దూసుకుపోతోంది. రిలీజైన నిమిషాల్లోనే ల‌క్ష‌ల్లో వ్యూస్ ని ద‌క్కించుకునేంత కంటెంట్ ఈ ట్రైల‌ర్ లో ఉంద‌ని చెప్పొచ్చు. ట్రైల‌ర్ ఆద్యంతం వ‌ర్మ త‌న‌దైన శైలి బ్లాక్ ల‌తో మెరుపులు మెరిపించాడు. ఎన్టీఆర్ పాత్ర‌ను, ల‌క్ష్మీ పార్వ‌తి ఎమోష‌న్ ని, చంద్ర‌బాబు వెన్నుపోటు రాజ‌కీయాల్ని, మామ‌నే వెన్ను పోటు పొడిచేందుకు పాల్ప‌డిన కుట్ర‌ను ప్ర‌తి దానిని ఈ ట్రైల‌ర్ లో రివీల్ చేశాడు ఆర్జీవీ. అబ‌ద్ధానికి నోరు పెద్ద‌ది.. అన్యాయానికి చెవులు పెద్ద‌వి.. అంటూ ఎన్టీఆర్ ఎమోష‌న్ ని ఎంతో అద్భుతంగా ఎలివేట్ చేశాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తున్నాం అంటూ బాల‌కృష్ణ‌- క్రిష్ జోడీ చూపించిన‌వ‌న్నీ అబ‌ద్ధాలు అని ఈ ట్రైల‌ర్ ప్రూవ్ చేసింది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. దేనికైనా టైమ్ రావాలి.. అని ఎవ‌ర‌న్నా అంటే అది ఎంత పెద్ద త‌ప్పో ఈ ట్రైల‌ర్ చూశాక అర్థ‌మ‌వుతుంది. టైమ్ రాదు అది మ‌న‌మే తీసుకురావాలి! అంటూ చంద్ర‌బాబు అతి పెద్ద నీతి సూత్రాన్ని ప్ర‌పంచానికి ఆవిష్క‌రించిన వైనం ఇంట్రెస్టింగ్. బాబా మ‌జాకానా? అన్న‌ది ఆర్జీవీ పాయింట్ ఆఫ్ వ్యూ!!!

Also Watch: Avasaram Video Song From Lakshmi’s Ntr