కొంటె చూపుతో.. నువ్వు చంప‌కే అలా..

ఈ ఫోటో చూస్తుంటే అచ్చంగా ఇదే అనాల‌నిపిస్తుంది క‌దా..! లేక‌పోతే చూడండి.. నిజంగానే త‌న చూపుల‌తో తినేసేలా ఈ అందాల రాక్ష‌సి ఎలా చూస్తుందో..? అందాల రాక్ష‌సి అనే పేరుకు నిజంగానే న్యాయం చేస్తుంది లావ‌ణ్య త్రిపాఠి. అందుకే విజ‌యాలు లేక‌పోయినా కూడా త‌న అందాల‌తో బండి లాక్కొచ్చేస్తుంది. సినిమాలు లేన‌పుడు ఖాళీ టైమ్ లో ఇలా ఫోటోషూట్లు చేసి ప్రేక్ష‌కుల గుండె కోస్తూ ఉంటుంది ఈ అందాల రాక్ష‌సి.
ఇండ‌స్ట్రీలో హిట్లు లేనిదే ఏ హీరోయిన్ ను ప‌ట్టించుకోరు. కానీ లావ‌ణ్య‌కు మాత్రం ఈ సూత్రం వ‌ర్తించ‌దు. ఈ ఏడాది మిస్ట‌ర్.. రాధా.. యుద్ధం శ‌ర‌ణం ఫ్లాపుల‌తో ఈ భామ రేస్ లో వెన‌క‌బ‌డిపోయింది. ఫ్లాపులున్నా కూడా అవ‌కాశాలు కూడా అలాగే వ‌స్తున్నాయి లావ‌ణ్య త్రిపాఠికి. ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ మ‌య‌వ‌న్.. సాయిధ‌రంతేజ్-వినాయ‌క్ సినిమా.. రామ్ తో ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ.. లాంటి క్రేజీ ఆఫ‌ర్ల‌తో దూసుకెళ్తుంది ఈ బ్యూటీ. పైగా మ‌ధ్య మ‌ధ్య‌లో అప్పుడ‌ప్పుడూ హాట్ ఫోటోషూట్ లతో అమ్మాయిగారు ర‌చ్చ చేస్తున్నారు. మొత్తానికి ఒకేసారి అవ‌కాశం ప్ల‌స్ అందం క‌లిస్తే కెరీర్ సూప‌ర్ హిట్ కావ‌డం గ్యారెంటీ అన్న‌మాట‌.