కన్ఫ్యూషన్ లో లావణ్య ఎంత పనిచేసిందో తెలుసా..?

ఒక్కోసారి మనం చేస్తున్న పనులు కొన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతుంటాయి. తొందరపడి తీసుకున్న నిర్ణయాలో లేక సమయం లేక తీసుకున్న నిర్ణయాలో తెలియవు కాని.. అలాంటి నిర్ణయాల కారణంగా లైఫ్ ఇబ్బందుల్లో పడుతుంది. ఇప్పుడు ఇలానే ఇబ్బంది పడుతుంది టాలెంటెడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం హాట్ బ్యూటీగా కూడా మారుతున్న లావణ్య తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణంలో విజయ్ దేవర కొండతో సినిమా చేయాలి. దానికి పరశురాం దర్శకుడు. బన్ని వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగులో సూపర్ హిట్ అయిన 100% లవ్ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో తమన్నా క్యారెక్టర్ కు లావణ్య ను ఎంచుకున్నారు. ఇక్కడే ఏమైంది అంటే.. తమిళంలో చేయాలి అనుకున్న లావణ్య తెలుగులో డేట్స్ ఎలా సర్దుబాటు చేయాలో తెలియక తికమక పడింది.

ఈ విషయం తమిళ దర్శకుడు చంద్రమౌళి కి మామూలుగానే చెప్తే.. అతను లావణ్యకు తెలియకుండా ఫోన్ చేసి బన్ని వాసుతో మీ సినిమాలో డేట్స్ కుదరకపోవడం వల్ల లావణ్య చేయడం లేదటగా అని అడిగాడట. దీంతో కోపం వచ్చిన బన్ని వాసు వెంటనే.. రష్మికను ఒకే చేయించాడని సమాచారం. ఇది తెలిసిన లావణ్య అగ్గిమీద గుగ్గిలం అయ్యి, తమిళ సినిమాను కూడా ఇప్పుడు వదులుకుందని తాజా ఇన్నర్ టాక్. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు చేతుల్లో ఉన్న రెండు క్రేజీ సినిమాలూ పోయాయని అంటున్నారు. ఆవేశంలో ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాల వలన ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కెరీర్ కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా అమ్మడు జాగ్రత్తగా ఉండటం మంచిదేమో. ప్రస్తుతానికైతే, తన కొత్త ప్రాజెక్టుల విషయంలో అమ్మడు కన్ఫ్యూషన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం ఏమవుతుందో మరి.