లావ‌ణ్యకు ఇక చావో రేవో..?

Last Updated on by

ఎంత పెద్ద మెడిసిన్ కు అయినా ఎక్స్ పైరీ ఉంటుంది. అలాగే ఇండ‌స్ట్రీలో కూడా అంతే. ఎంత‌టి క్రేజీ హీరోయిన్ కు అయినా కూడా క‌చ్చితంగా ఎక్స్ పైరీ ఉంటుంది. ఏదో ఓ రోజు ఆమెకు కూడా అవ‌కాశాలు త‌గ్గిపోతాయి. ఇక్క‌డ వైకుంఠపాళి ఆట న‌డుస్తుంటుందంతే. ఆట తెలిసి పాము అనే ఫ్లాప్ నోట్లో ప‌డ‌కుండా హిట్ అనే నిచ్చెన ఎక్కుతూ వెళ్లిపోవాలి. ఒక్క‌సారి పాము నోట్లో ప‌డితే కింద‌కి జారిపోవాల్సిందే. ఈ ఆట తెలియ‌కే చాలా ఏళ్లుగా ఇబ్బంది ప‌డుతుంది లావ‌ణ్య త్రిపాఠి.

లావ‌ణ్య అప్పుడ‌ప్పుడూ నిచ్చెన‌లు ఎక్కుతుంది కానీ ఎక్కిన నిచ్చెన‌ల కంటే పాము నోట్లోనే ఎక్కువ‌గా ప‌డుతుంటుంది ఈ భామ‌. ఇప్పుడు మ‌రీ దారుణంగా ఆట మొద‌ట్లోనే ఉంది లావ‌ణ్య త్రిపాఠి. పాములు ఎన్నో సార్లు కాటేసిన త‌ర్వాత ఇప్పుడు చివ‌ర‌గా ఒక్క నిచ్చెన ఎక్కాల‌ని చూస్తుంది. ఆ నిచ్చెన పేరు ఇంటిలిజెంట్. సాయిధ‌రంతేజ్ సాయంతో మ‌రోసారి ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాల‌ని చూస్తుంది ఈ భామ‌. లావ‌ణ్య కెరీర్ ను సాయిధ‌రంతేజ్ ఏం చేస్తాడో..?

User Comments