లీకుల‌తో తార‌క్‌కి బెదిరింపులు

Last Updated on by

అవును.. లీకులిస్తూ తార‌క్‌ని బెదిరిస్తున్నారా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. గ‌త కొంత‌కాలంగా అర‌వింద స‌మేత సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు, ఇత‌ర‌త్రా స‌మాచారం లీక‌వ్వ‌డంపై తార‌క్ అభిమానుల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇదంతా ఎవ‌రో కావాల‌నే చేస్తున్నారా? లేక ఇలా మొత్తం స్టోరీ లీక్ చేసేసేలా ఫోటోల్ని ఎందుకు రివీల్ చేస్తున్నారో అన్న సందిగ్ధ‌త నెల‌కొంది.

మొన్న‌టికి మొన్న `అర‌వింద స‌మేత` క‌థ‌కు `నాన్న‌కు ప్రేమ‌తో` క‌థ‌తో సారూప్యాలున్నాయ‌ని, ఇవి రెండూ తండ్రి కొడుకుల సెంటిమెంటు క‌థ‌ల‌తో న‌డిచేవేన‌ని లీకులిచ్చారు. తాజాగా లీకైన ఓ ఫోటో ఈ విష‌యాన్ని ధృవీక‌రించింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ ఎంతో కంగారుగా ఉన్నాడు. ఆ ప‌క్క‌నే కార్‌లో తండ్రి అయిన నాగ‌బాబు విష‌యంలో హ‌ర్రీగా క‌నిపించాడు. ఇదంతా చూస్తుంటే ఏదో భారీ ఎస్కేప్‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన తండ్రిని తీవ్ర ఆందోళ‌న‌తో దూరంగా తీసుకెళుతున్నాడేమో అనిపిస్తోంది. అస‌లే రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం ఉన్న సినిమా కాబ‌ట్టి ఇలాంటి ఎమోష‌న‌ల్ సీన్స్ ప‌రాకాష్ట‌లో ఉండ‌బోతున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే ఇలాంటి కీల‌క ఫోటో లీకైతే క‌థంతా లీకైన‌ట్టే. మ‌రి యూనిట్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

User Comments