దుబాయ్ లో ఆ రాత్రి శ్రీ‌దేవికి ఏమైంది

Last Updated on by

రోజూ మాదిరే ఆ రోజు కూడా జాబిల‌మ్మ వ‌చ్చింది. కానీ పోతూ పోతూ త‌న‌తో పాటు నేల‌పై ఉన్న జాబిల‌మ్మ‌ను కూడా తీసుకెళ్లిపోయింది. ఒక్క రాత్రి కాళ‌రాత్రి అయిపోయింది. అంద‌రూ ఘాడ‌నిద్ర‌లో ఉండ‌గానే.. శ్రీ‌దేవి కూడా శాశ్వ‌త నిద్ర‌లోకి వెళ్లిపోయింది. అస‌లేం జ‌రిగిందో ఎవ‌రికీ న‌మ్మ‌కం కూడా క‌ల‌గ‌లేదు. శ్రీ‌దేవి మ‌ర‌ణం ఇప్ప‌టికీ ఓ క‌లే. ఏం జ‌రిగిందో ఎవ‌రికీ క్లారిటీ లేదు. అస‌లు విష‌యం ఏంటంటే.. వారం రోజుల కింద బోనీక‌పూర్ బంధువు మోహిత్ మార్వా పెళ్లికి చిన్న కూతురు ఖుషీ క‌పూర్, భ‌ర్త బోనీక‌పూర్ తో క‌లిసి వెళ్లింది శ్రీ‌దేవి. అక్క‌డే ప్ర‌తీ రోజూ మ‌నీష్ మ‌ల్హోత్రా ట్రెండింగ్ క్యాస్ట్యూమ్స్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. డాన్సులు కూడా చేసారు. రోజూలాగే ఫిబ్ర‌వ‌రి 24 రాత్రి కూడా డాన్సులు చేసారు.Legendary Actress Sridevi Passes Away Behind Sceneఅంత‌లోనే శ్రీ‌దేవి వాష్ రూమ్ కు వెళ్ల‌డం.. అక్క‌డే స్పృహ త‌ప్ప‌డం.. ఎంత‌కీ బ‌య‌టికి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు హాస్పిట‌ల్ కు తీసుకెళ్ల‌డం.. అప్ప‌టికే అతిలోక‌సుంద‌రి అనంత‌లోకాల‌కు వెళ్ల‌డం అన్నీ జ‌రిగిపోయాయి. అస‌లు ఏం జ‌రిగిందో.. తెలియ‌క‌ముందే అన‌ర్థం జ‌రిగిపోయింది. ఆమె మ‌ర‌ణం వెన‌క ఏమైనా మిస్ట‌రీ ఉందా అనే అనుమానం కూడా ఇప్పుడు కొత్త‌గా బ‌య‌టికి వ‌స్తున్నాయి. కానీ అలాంటిదేం లేద‌ని.. శ్రీ‌దేవికి హార్ట్ ఎటాక్ కార‌ణంగానే మ‌ర‌ణం సంభ‌వించింద‌ని డాక్ట‌ర్లు తేల్చేసారు. ఇప్పుడు ఇక అనుమానాలు అవ‌స‌రం లేదు. ఒక్క రాత్రి తెలుగు ప్రేక్ష‌కులకు కాళ‌రాత్రిలా మారిపోయింది. మ‌న శ్రీ‌దేవిని మ‌న‌కు కాకుండా చేసింది. ఆమె చివ‌రి చూపు మ‌రికొన్ని గంట‌లు మాత్ర‌మే ఉండ‌బోతున్నాయి. ఆ త‌ర్వాత శాశ్వ‌తంగా ఆ రూపాన్ని ప్ర‌త్య‌క్షంగా చూడాల‌న్నా చూడ‌లేం..!

User Comments