శ్రీదేవి భౌతిక‌కాయం ఆలస్యానికి కారణాలు

Last Updated on by

శ్రీ‌దేవి.. శ్రీ‌దేవి.. శ్రీ‌దేవి.. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఈ నామ‌జ‌ప‌మే చేస్తున్నారు. ఈమె మ‌ర‌ణం ఇప్పుడు ఎవ‌రూ జీర్ణించు కోలేక‌పోతున్నారు. దుబాయ్ లోనే క‌న్నుమూసిన శ్రీదేవి భౌతిక‌కాయం ఇప్ప‌టికీ అక్క‌డే ఉంది. అక్క‌డే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేస్తున్నారు కుటుంబ స‌భ్యులు. దుబాయ్ లోనే పోస్ట్ మార్టమ్ కూడా పూర్తి చేస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వ‌చ్చిన త‌ర్వాత ఇండియాకు రానున్నారు. దుబాయ్ లోనే అన్ని పూర్తి చేసి.. ఇండియాలో కేవ‌లం అభిమానుల సంద‌ర్శ‌నార్థం.. సెలెబ్రెటీల నివాళీల కోసం మాత్ర‌మే ఉంచ‌నున్నారు. శ్రీ‌దేవి పార్థివ దేహం ముంబైకి తీసుకురావ‌డానికి ప్ర‌త్యేకంగా త‌న స్పెష‌ల్ ఫ్లైట్ ను దుబాయ్ కు పంపించాడు అనిల్ అంబాని. ఫిబ్ర‌వ‌రి 25 రాత్రి 8 గంట‌ల‌కు ముంబైలోని త‌న ఇంటికి శ్రీ‌దేవి పార్థివ దేహం రానుంది.

ఫిబ్ర‌వ‌రి 26 ఉద‌యం ముంబైలోని మెహ‌బూబా స్టూడియోలో కాస‌పు శ్రీ‌దేవి పార్థివ‌దేహాన్ని అభిమానుల సంద‌ర్శ‌నార్థం ఉంచ‌నున్నారు. ఆ త‌ర్వాత ఆమె అంతిమ‌యాత్ర ప్రారంభం కానుంది. బాలీవుడ్.. కోలీవుడ్.. టాలీవుడ్.. శాండిల్ వుడ్ అన్ని ఇండ‌స్ట్రీల నుంచి ముంబైకి శ్రీ‌దేవిని చూడ్డానికి.. ఆమెకు నివాళులు అర్పించ‌డానికి బ‌య‌ల్దేరుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 26 మ‌ధ్యాహ్నం జుహూలోని శాంతాక్రాజ్ స్మ‌శాన వాటిక‌లో శ్రీ‌దేవి అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌నున్నారు. తమిళనాడులోని శివకాశీలో 1963 ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మాయాంగేర్ అయ్యపాన్. సినిమాల్లోకి వచ్చాక ఆమె శ్రీదేవిగా మారారు. బాలనటిగా కందన్ కరుణ్ (తమిళ్) సినిమాతో 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి.. బాలనటిగా తెలుగు సినిమాల్లో నటించారు. 50 ఏళ్ల పాటు సినీ క‌ళామ‌త‌ల్లికి సేవ‌లు చేసిన శ్రీ‌దేవి.. ఇప్పుడిలా హ‌ఠాన్మ‌ర‌ణంతో అంద‌రికీ షాకిచ్చింది.

User Comments