షాకింగ్.. శ్రీ‌దేవిది హార్ట్ ఎటాక్ కాదట..?

Last Updated on by

రెండు రోజులుగా వింటున్న‌దే నిజ‌మైంది. అస‌లు అంత ఆరోగ్యంగా క‌నిపించిన శ్రీ‌దేవికి క‌నీసం ముంద‌స్తు సింప్ట‌మ్స్ ఏమీ లేకుండా హార్ట్ ఎటాక్ ఎలా వ‌చ్చింద‌బ్బా అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. బోనీక‌పూర్ తో పాటు అంతా కూడా త‌న‌కు హార్ట్ ఎటాక్ వ‌చ్చింద‌ని చెప్ప‌డంతో న‌మ్మ‌క త‌ప్ప‌లేదు. అంతా అదే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె ఫోరెన్సిక్ రిపోర్ట్ వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 26 మ‌ధ్యాహ్నం శ్రీ‌దేవి డెత్ స‌ర్టిఫికేట్ ఇష్యూ అయింది. ఇందులో కాస్ ఆఫ్ డెత్ అనే స్థానంలో డ్యూ టూ యాక్సిడెంట‌ల్ డ్రానింగ్ (ప్ర‌మాద‌వ‌శాత్తు జారిప‌డ‌టం) వ‌ల్లే చ‌నిపోయింద‌ని రాసుంది.

ఆ స‌మ‌యంలో శ్రీ‌దేవి శ‌రీరంలో ఆల్క‌హాల్ కూడా ఉంద‌నే వార్త‌లున్నాయి. ఈ విష‌యంపై పోలీసులు కూడా శ్రీ‌దేవి మ‌ద్యం తీసుకుంద‌నే క్లారిటీ ఇచ్చారు. అప్ప‌టి వ‌ర‌కు ఆరోగ్యంగానే ఉన్న శ్రీ‌దేవి.. రాత్రి 11 గంట‌ల ప్రాంతంలో బోనీ క‌పూర్ వ‌చ్చి నిద్ర లేపిన త‌ర్వాత వాష్ రూమ్ కు వెళ్లి జారిప‌డింది. మ‌ద్యం కూడా బాడీలో ఉండ‌టంతో ప్ర‌భావం ఎక్కువ‌గా ప‌డింది. దాంతో వెంట‌నే గుండె ఆగిపోయింద‌ని చెప్పారు వైద్యులు. అయితే కింద‌ప‌డినందుకే శ్రీ‌దేవి చ‌నిపోయింద‌ని.. ఆ త‌ర్వాత వ‌స్తే హార్ట్ ఎటాక్ కూడా వ‌చ్చే ఛాన్స్ ఉండొచ్చంటున్నారు వైద్యులు. అయితే ఆమె చ‌నిపోవ‌డానికి రీజ‌న్ మాత్రం బాత్ ట‌బ్ లో జారిప‌డ‌టమే అని తేల్చేసారు డాక్ట‌ర్లు.

User Comments