అర్జున్ సుర‌వ‌రం కి సైడ్ ప్లీజ్

నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన అర్జున్ సుర‌వ‌రంకు రిలీజ్ కు లైన్ క్లియ‌ర్ అయింది. సైడ్ సైడ్ ప్లీజ్ అంటూ కొత్త రిలీజ్ తేదీని అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాన‌ని నిఖిల్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తిచేసుకుని రెడీగా ఉంది. ప‌లు మార్లు రిలీజ్ తేదీలు కూడా ప్ర‌క‌టించారు. కానీ రిలీజ్ చేయ‌లేక‌పోయారు. అందుకు కార‌ణాలు అనేకం. తాజాగా నిఖిల్ ట్వీట్ తో లైన్ క్లియ‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో హిట్టు కొట్టి గెలుపు గుర్రం ఎక్కాల‌ని నిఖిల్ వెయిట్ చేస్తున్నాడు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా త‌ర్వాత నిఖిల్ కి సరైన విజ‌యం ద‌క్క‌లేదు. మార్కెట్ పై కూడా ప్ర‌భావం ప‌డింది. దీంతో అర్జున్ సుర‌వ‌రంపై గంపెడు ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి కొత్త రిలీజ్ తేదీ ఎప్పుడ‌న్న‌ది తెలియాల్సి ఉంది. ఇందులో నిఖిల్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి న‌టించింది. సంతోష‌.టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ- ఔరా సినిమాస్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు.