6ల‌క్ష‌ల‌కు అన్ని లిప్‌లాక్‌లా?

Last Updated on by

ఒక‌టి కాదు.. రెండు కాదు.. మూడు కాదు .. నాలుగు కాదు.. కావాల్సిన‌న్ని ముద్దులిస్తుంది. ముద్దులంటే మామూలు ముద్దులు కాదు.. చొక్కా గుండీలు విప్పుతుంది.. త‌నివితీరా కౌగిలించుకుంటుంది.. ఆపై పెద‌వి పెద‌వి క‌లిపి ఎలా ముద్దు పెట్టాలో నేర్పిస్తుంది. ఇలా చేసినందుకు ఎంత అడుగుతుంది? అంటారా? జ‌స్ట్ 6ల‌క్ష‌లు ఇచ్చుకుంటే చాలు. ఇంత‌కీ ఎవ‌ర‌మ్మా ఈవిడ‌? .. ఆవిడే ఆర్‌.ఎక్స్.100 బ్యూటీ పాయ‌ల్ రాజపుత్‌.

ప్ర‌స్తుతం ఏ న‌లుగురు కుర్రాళ్లు గుమిగూడినా పాయ‌ల్ పెద‌వి ముద్దుల గురించిన హాట్ టాపిక్ ర‌న్ అవుతోంది. ఇలా ఇన్ని ముద్దులిచ్చేసింది క‌దా రెమ్యున‌రేష‌న్ ఎంత తీసుకుందేంటి? అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే పాయ‌ల్‌కి ఇది డెబ్యూ సినిమానే కాబ‌ట్టి నామ‌మాత్రంగానే పైకం అందుకుందిట‌. కేవ‌లం రూ.6ల‌క్ష‌ల పారితోషికం చెల్లించి అంత ఔట్‌పుట్ తీసుకున్నారా? ఓరి దేవుడ‌!! అంటూ ఆ నిర్మాత‌ల్ని తెగ పొగిడేస్తున్నారంతా. ఎంత డెబ్యూ హీరోయిన్ అయినా ఇది షాకింగ్ రెమ్యున‌రేష‌న్ అనే చెప్పాలి. తొలి సినిమా కాబ‌ట్టి నామ‌మాత్రం.. మ‌లి సినిమాకి ఎంత గుంజుతుందో చూడాలి. ఆల్రెడీ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఈ అమ్మ‌డి వెంట ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. పాయ‌ల్‌లో ప్ర‌తిభ‌కు కొద‌వేం లేదు. అంత‌కుమించి ఫ్లెక్సిబిలిటీ ఉందంటూ ఫిలింన‌గ‌ర్‌లో ఒక‌టే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ్‌.

User Comments