3డి దెయ్యం లీసాకి సెన్సార్ UA

అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లీసా 3డి సెన్సార్ పూర్త‌యింది. ఈనెల 24న థియేటర్లలోకి వస్తోంది ఈ చిత్రానికి యుఏ స‌ర్టిఫికెట్ అందించిన సెన్సార్ బృందం 3డి దెయ్యాన్ని అద్భుతంగా చూపించారంటూ ప్ర‌శంస‌లు కురిపించింది.

స‌మ‌ర్ప‌కుడు వీరేష్ మాట్లాడుతూ-“డ‌బ్బింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తయ్యాయి. 24 న రిలీజ్ చేస్తున్నాం. తాజాగా సెన్సార్ పూర్త‌యింది. ఈ సినిమాకి యుఏ స‌ర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బృందం ప్ర‌శంస‌లు కురిపించింది. 3డిలో దెయ్యాన్ని చూడ‌డం స‌రికొత్త అనుభూతిని క‌లిగిస్తుంద‌ని సెన్సార్ టీమ్ ప్ర‌శంసించ‌డం ఆనందాన్నిచ్చింది. ష్యూర్ షాట్ గా హిట్ కొడ‌తాం. ఈ స‌మ్మ‌ర్ లో పిల్ల‌లు పెద్ద‌ల‌తో క‌లిసి చూడాల్సిన అరుదైన హార‌ర్ చిత్ర‌మిది. లీసా 3డిని థియేట‌ర్ల‌లో చూసి ఆస్వాధించండి“ అన్నారు. నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ-“ఇండస్ట్రీ బెస్ట్ హారర్ చిత్రం చూడబోతున్నాం. ఈ సినిమా రాకపై ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నాం. జర్నీ.. షాపింగ్ మాల్.. లాంటి సినిమాలు యూనిక్ స్టైల్ లో కొత్త కంటెంట్ తో వచ్చిన సినిమాల్ని మా ఎస్.కె పిక్చర్స్ లో అందించాం. ఈ సినిమా ఎంపికకు కారణం ఎక్స్ క్లూజివ్ స్టైల్.. గత చిత్రాల్ని మించి వినూత్నమైన అనుభూతిని అందించే చిత్రం అవుతుందన్న నమ్మకంగా ఉన్నాం. ముఖ్యంగా 3డి విజువల్స్ ఫెంటాస్టిక్ అని సెన్సార్ బృందం ప్రశంసలు కురిపించ‌డం కాన్ఫిడెన్స్ ని మ‌రింత‌ పెంచింది. కథాంశం సింపుల్ గా కనిపించినా ఆద్యంతం గ్రిప్పింగ్ నేరేషన్ తో రక్తి కట్టించిందని .. దెయ్యాన్ని 3డిలో చూడ‌డం అన్న‌ది ఈ సినిమా స‌క్సెస్ కి క‌లిసొస్తుంద‌న్న ప‌లువురి నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి“ అని తెలిపారు. లీసా 3డి చిత్రానికి రాజు విశ్వనాథం దర్శకత్వం వహించారు. సంతోష్ దయానిధి సంగీతం అందించారు.