అక్కినేని కోడ‌లు గుడ్ న్యూస్

Last Updated on by

అక్కినేని కోడ‌లు స‌మంత శుభ‌వార్త చెబుతోందా? అంటే అవున‌నే తాజా హింట్ చెబుతోంది. అక్టోబ‌ర్ 2017లో స‌మంత అక్కినేని బుల్లోడు నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఈ జోడీ పెళ్లి త‌ర్వాత సెల‌బ్రేష‌న్స్ కంటే కెరీర్ పైనే ఎక్కువ ఫోక‌స్ చేయ‌డంతో కొన్నిటిని వాయిదా వేసుకున్నారు. ఆ సంగ‌తిని మీడియాకి ఓపెన్ గానే ప్ర‌క‌టించారు కూడా.

తాజా హింట్ ప్ర‌కారం.. 2019 లో అక్కినేని ఇంట శుభ‌వార్త ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఆ మేర‌కు అక్కినేని స‌మంత త‌న ఇన్ స్టాగ్ర‌మ్ లో హింట్ ఇవ్వ‌డంపై ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. “నాకు కొన్ని ప‌చ్చ‌ళ్లు(పికిల్స్) ఎలా వ‌చ్చేది?“ అంటూ ఓ కామెంట్ ని ఒక అంద‌మైన ఫోటోకి క్యాప్ష‌న్ గా ఇచ్చింది. అలాగే “2019లో (కొత్త సంవ‌త్స‌రం)లోకి నెమ్మ‌దిగా అడుగులు వేస్తున్నా.. అంచ‌నాలు పెద్ద‌గానే ఉన్నాయి“ అంటూ మ‌రో హింట్ ఇచ్చింది. అంటే 2019లో అక్కినేని ఇంట గుడ్ న్యూస్ వినిపించ‌బోతోంద‌నే దీన‌ర్థం. అక్కినేని లిటిల్ హీరో పుట్టుకొస్తున్నాడ‌నే అభిమానులు భావిస్తున్నారు. ఇక స‌మంత‌, నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం మ‌జిలీ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

User Comments