లోఫ‌ర్ బ్యూటీ స‌్విమ్ హీట్‌

Last Updated on by

`లోఫ‌ర్` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన దిశా ప‌టానీ ఇక్క‌డ స‌క్సెస్ కాలేదు కానీ, బాలీవుడ్‌లో మాత్రం కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీ అయిపోయింది. ఇటీవ‌లే ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న న‌టించిన `భాఘి 2` సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో దిశా జోరు మ‌రింత‌గా పెరిగింది. స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న `భ‌ర‌త్` చిత్రంలో క్రేజీగా అవ‌కాశం అందుకుంది దిశా.

టైగ‌ర్‌తో ఓవైపు దాగుడుమూత‌ల దాంప‌త్యం సాగిస్తున్న ఈ అంద‌గ‌త్తెకు యూత్‌లో అంత‌కంత‌కు ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇక దిశా ప‌టానీ లేటెస్ట్ ఫోటోషూట్లు అయితే స‌మ్మ‌ర్ హీట్‌ని డ‌బుల్ చేస్తున్నాయి. ఇంత‌కుముందు ఒంటరి దీవుల్లో టైగ‌ర్‌తో క‌లిసి ఈ అమ్మ‌డు అదిరిపోయే విన్యాసాల‌తో క‌న్నుల‌పండువ చేసింది. ఆ ఫోటోల‌న్నీ సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు మ‌రోసారి టైగ‌ర్‌తో క‌లిసి ఏ దివికేగిందో.. అక్క‌డ నుంచి వేడెక్కించే స్విమ్‌సూట్ ఫోటోషూట్‌తో చెల‌రేగిపోయింది. సెక్సీ, బ్యూటిఫుల్ .. ఫాల్తూ అంటూ అభిమానులు కామెంట్ల‌తో చెల‌రేగిపోతున్నారంటే దిశాని ఈ లుక్‌లో ఎంత‌గా ప్రేమించారో అర్థం చేసుకోవ‌చ్చు. దాదాపు కోటిన్న‌ర మంది సామాజిక‌మాధ్య‌మాల్లో దిశాను అనుస‌రిస్తున్నారు. అంటే అంత‌మందికి ఇక విజువ‌ల్ ఫెస్ట్ షూరూ అయిన‌ట్టే!!

User Comments