థ‌మ‌న్.. ఎన్నాళ్ల‌కు కొట్టావ‌య్యా కొత్త‌గా..!

Last Updated on by

థ‌మ‌న్.. ఈ పేరు విన‌గానే మ‌న‌కు తెలియ‌కుండానే కొన్ని రాగాలు చెవుల్లో మారుమోగిపోతుంటాయి. అవి కూడా వ‌చ్చిన రాగాలే మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తుంటాయి. దానికి కార‌ణం ఆయ‌న రిపీటెడ్ ట్యూన్స్. ఇచ్చిన పాట‌లే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇచ్చి కాపీ క్యాట్ అనిపించుకున్నాడు థ‌మ‌న్. కెరీర్ మొద‌ట్లో ఇచ్చిన పాట‌లు త‌ప్పితే.. ఈ మ‌ధ్య కాలంలో థ‌మ‌న్ ఇచ్చిన పాట‌ల‌కు పెద్ద‌గా రెస్పాన్స్ అయితే రావ‌డం లేదు. కానీ చాలా రోజుల త‌ర్వాత ఈయ‌న పాట‌ల‌కు మంచి అప్లాజ్ వ‌స్తుంది. అదే తొలిప్రేమ‌. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించాడు. వెంకీఅట్లూరి ద‌ర్శ‌కుడు.

వెంకీ రాసుకున్న అంద‌మైన ప్రేమ‌క‌థ‌కు త‌న అంద‌మైన సంగీతాన్ని తోడు చేసి.. శిల్పానికి ప్రాణం పో శాడు థ‌మ‌న్. మిగిలిన సినిమాల మాదిరి ఆ మాస్ రొటీన్ మ్యూజిక్ కాకుండా.. ఎక్క‌డో తెలియ‌ని కొత్త ఫీల్ తీసుకొచ్చాడు థ‌మ‌న్. నిజంగా ఈ పాట‌లిచ్చింది థ‌మ‌నేనా అనే అనుమానం అయితే క‌చ్చితంగా వ‌స్తుంది. ఎందుకంటే ఈ సినిమా మ్యూజిక్ లో అంత ఫ్రెష్ నెస్ క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే అల్ల‌సాని పెద్ద‌న‌.. నిన్నిలా పాట‌ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చాడ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చెబుతున్నారు. మొత్తానికి తొలిప్రేమ‌కు బ్యాక్ బోన్ లా నిలిచి.. త‌న కెరీర్ కు మ‌రో పునాది వేసుకున్నాడు థ‌మ‌న్. మరి ప్ర‌తీ సినిమాకు థ‌మ‌న్ నుంచి ఇలాంటి కొత్త‌ద‌న‌మే కోరుకుంటున్నారు ప్రేక్ష‌కులు కూడా..!

User Comments