ల‌వ‌ర్స్ డే మూవీ రివ్యూ

న‌టీన‌టులు : ప‌్రియా ప్ర‌కాష్ వారియ‌ర్, రావుఫ్‌ రోష‌న్, గ‌దా త‌దిత‌రులు
బ్యాన‌ర్: సుఖీభ‌వ సినిమాస్
నిర్మాత‌: గురురాజ్.ఎ, వినోద్ రెడ్డి సి.హెచ్
సంగీతం: షాన్ రెహ‌మాన్
ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు

ముందు మాట‌:
ఒకే ఒక్క కన్నుగీటుతో ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. దీపిక ప‌దుకొనే, స‌న్నిలియోని మించి సామాజిక మాధ్య‌మాల్లో ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకుంది ఈ అమ్మ‌డు. `ఒరు ఆడార్ ల‌వ్`(మ‌లయాళం) తొలి టీజ‌ర్ తో ఓవ‌ర్‌నైట్ లోనే అసాధార‌ణ పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం టాలీవుడ్ లోనూ ప్ర‌కంప‌నాల‌కు రెడీ అవుతోంది. ప్రియా ప్ర‌కాష్ – రోష‌న్ జంట మ‌ధ్య క‌న్ను గీటుడు స‌న్నివేశం పెద్ద రేంజులో వ‌ర్క‌వుటైంది. టీనేజీ యువ‌త కాలేజ్ ల‌వ్ స్టోరితో ఒమ‌ర్ లులు తెర‌కెక్కించిన `ఒరు ఆడార్ ల‌వ్` తెలుగులో `ల‌వ‌ర్స్ డే` పేరుతో నేడు రిలీజైంది. ప్రేమికుల దినోత్స‌వం కానుక‌గా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నామ‌ని నిర్మాత‌లు గురురాజ్, వినోద్ రెడ్డి తెలిపారు. అయితే ఈ సినిమాకి జ‌రిగిన ప్ర‌చారార్భాటం చూస్తే పెద్ద హిట్ట‌వుతుంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే సినిమాలో సీనెంత‌? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూ చ‌ద‌వాల్సిందే.

క‌థ‌:
టీనేజ్‌లో అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య పుట్టేది ఏది? కాలేజ్ లో చేరాక తొలిగా పుట్టేది ఆక‌ర్ష‌ణ‌. ఆ ఆక‌ర్ష‌ణ ప్రేమ‌గా మారితే ఎలా ఉంటుంది? ఈ ప్రేమ‌క‌థ‌లో కాలేజ్ స్నేహితుల ఇన్వాల్వ్ మెంట్ ఎలా ఉంటుంది? విల‌న్ గ్యాంగ్ ఆ ప్రేమ‌క‌థ‌ల‌కు ఎలా అడ్డు పడింది? చివ‌రికి ప్రేమ‌క‌థ ఏ కంచికి చేరింది? అన్న‌దే ఈ సినిమా క‌థాంశం. అంద‌రికీ తెలిసిన .. ఇప్ప‌టికే వ‌చ్చేసిన ఎన్నో ప్రేమ‌క‌థా చిత్రాల త‌ర‌హానే మ‌రో ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ప్రేమ‌క‌థ‌లు ఎప్పుడూ డిఫ‌రెంటుగా ఉండ‌వు. అమ్మాయి – అబ్బాయి మ‌ధ్య‌ స్నేహం, ప్రేమ చుట్టూనే క‌థ‌ల‌న్నీ ర‌న్ అవుతుంటాయి. కాలేజ్ లో ప్రేమ‌క‌థ‌లతో పాటు యాంటీ గ్యాంగ్ .. విల‌న్ గ్యాంగ్ ప్ర‌తిఘ‌ట‌న త‌ప్ప‌నిస‌రి. అయితే ప్ర‌తిసారీ ద‌ర్శ‌కుడు ప్రేమ‌క‌థ‌ను ఎంత‌ కొత్త‌గా ఆవిష్క‌రించాడు.. ఫీల్ గుడ్ మూవ్ మెంట్స్‌తో ఎంత ఎమోష‌న‌ల్ గా చూపించ‌గ‌లిగాడు అన్న‌దే అస‌లైన‌ పాయింట్. అయితే ఒక క్యూట్ పెయిర్ ని ఎంచుకుని చ‌క్క‌ని మ్యూజిక్ ని తీసుకుని తెర‌పై మ్యాజిక్ చేయ‌డంలో మాత్రం ద‌ర్శ‌కుడు ఒమ‌ర్ లులు ఎందుక‌నో ఫెయిల‌య్యాడు. అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను అంతే నాశిర‌కం విజువ‌ల్స్ తో చుట్టేయ‌డంతో ఇన్నాళ్లుగా సాగిన ప్ర‌చారానికి అర్థంప‌ర్థం లేనేలేద‌ని తేల్చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాకి నాశిర‌కం ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు, క్వాలిటీ లేని డ‌బ్బింగ్ పెద్ద ఇబ్బందిక‌రం అనే చెప్పాలి. డాన్ బాస్కో కాలేజ్ నేప‌థ్యంలో.. రోష‌న్, ప్రియా ప్ర‌కాష్ మ‌ధ్య కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా పండినా .. క‌థ‌ను వండి వార్చ‌డంలో పెద్ద ఫెయిల్యూర్ క‌నిపించింది.

న‌టీన‌టులు:
తెర‌నిండుగా ప్రియా ప్ర‌కాష్ అంద‌చందాలు, న‌ట‌న మైమ‌రిపిస్తాయి. రోష‌న్ అత‌డి స్నేహితుల బృందం న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది.

ప్ల‌స్ పాయింట్స్:
*ప్రియా ప్ర‌కాష్, రోష‌న్ న‌ట‌న‌
*షాన్ రెహ‌మాన్ అద్భుత‌మైన సంగీతం పెద్ద ప్ల‌స్
* ద్వితీయార్థం కొంత బెట‌ర్

మైన‌స్ పాయింట్స్:
* క‌థ‌లో బ‌ల‌హీన‌త .. క‌థ‌నంలో గ్రిప్ లేక‌పోవ‌డం..
* రొటీన్ ప్రేమ‌క‌థ‌
* ఫ‌స్టాఫ్ రొటీన్ .. బోరింగ్..

టెక్నీషియ‌న్స్:
గొప్ప సీన్స్ .. గొప్ప మాంటేజ‌స్ చూపించినా.. ద‌ర్శ‌క‌త్వంలో మార్క్ వేయ‌డంలో ఒమ‌ర్ లులు ఫెయిలయ్యారు. షాన్ రెహ‌మాన్ సంగీతం, పాట‌లు తెర‌కెక్కించిన విధానం అద్భుతం. కెమెరా మ్యాజిక్ తో పాటు సంగీతం, రీరికార్డింగ్ మైమ‌రిపిస్తాయి. ద‌ర్శ‌కుడిగా ఒమ‌ర్ లులు వంద శాతం మార్క్ ని వేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు అంతంత మాత్ర‌మే. డ‌బ్బింగ్ నాశిర‌కం అనిపిస్తుంది.

ముగింపు:
వింక్ గాళ్ క‌వ్వింత‌ కోసం మాత్ర‌మే.. బిలో యావ‌రేజ్ ల‌వ్ స్టోరి..

రేటింగ్‌:
2.25/5.0