మా`ప్ర‌మాణ స్వీకారం రోజునే క‌ల‌క‌లం!

Last Updated on by

న‌రేష్ అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన `మా` నూత‌న కార్య‌వ‌ర్గం నేడు ప్ర‌మాణం స్వీకారం చేసింది. అయితే న‌రేష్ ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం నేను ప‌నిచేస్తాను అని మాటికి ముందు వెనుక అన‌డంతో ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజ‌శేఖ‌ర్ అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. మైక్ ప‌ట్టుకుని మాట్లాడుతోన్న రాజశేఖ‌ర్ ఒక్క‌సారిగా ఇలాంటి ప‌రిస్థితుల్లో మాట్లాడ‌టం ఇష్టం లేదంటూ మైక్ ఇచ్చేసి అల‌క పానుపు ఎక్కారు. అనంత‌రం మ‌ళ్లీ జీవిత చేతిలో మైక్ లాక్కొని నేను మాట్లాడ‌టానికి చాలా ఉంది. మీకు ఓపిక ఉంటే వినొచ్చు. న‌రేష్ నేను నేను అన్న మాట వాడి ఉండ‌కూడ‌దు. మేము అని మాట్లాడాలి. నేను ఈ కార్య‌క్ర‌మానికి రావాల‌నుకోలేదు. న‌రేష్ పిలిస్తే వ‌చ్చాను.

అంద‌రం క‌లిసే మా అసోసియేష‌న్ ఎన్నిక‌లు కోసం ప‌నిచేసాం. కాబ‌ట్టి ఇక‌పై న‌రేష్ మాట్లాడేట‌ప్పుడు నేను అని కాకుండా మేమ అని మాట్లడితే బాగుంటుంది అని రాజశేఖర్‌ వ్యాఖ్యానించారు. ఆ స‌మ‌యంలో న‌రేష్ నేను ఏదో స‌ర‌దాగా అన్నాన‌ని రాజ‌శేఖ‌ర్ ని స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేసారు. దీంతో మిగ‌తా స‌భ్యుల్లో , వేదిక‌పై ఉన్న వాళ్లంతా ఒకింత అసంతృప్తికి గుర‌య్యారు. ప్ర‌మాణ స్వీకారం రోజునే న‌రేష్ ఆదిపత్యం చూపించే ప్ర‌య‌త్నం చేశార‌ని మా మెంబ‌ర్ల‌ల‌లో సైతం హాట్ టాపిక్ అయింది. న‌రేష్ కూడా రాజ‌శేఖ‌ర్ వ్యాఖ్య‌ల‌పై అసంతృప్తికి లోన‌య్యారు.

Also Watch: Maa New Body Pooja At Office

User Comments