శివాజీరాజా కొడుకు హీరోగా..

Last Updated on by

న‌ట‌వార‌సులు బ‌రిలో దిగుతున్న సీజ‌న్ ఇది. మెగా అల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ బ‌రిలోనే ఉన్నాడు. ఈలోగ‌నే మ‌రో వార‌సుడు వ‌చ్చేస్తున్నాడు. మా అధ్య‌క్షులు, న‌టుడు శివాజీరాజా త‌న‌యుడు విజయ్ రాజా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఏదైనా జ‌ర‌గొచ్చు అనేది సినిమా టైటిల్‌. కె.రమాకాంత్ ద‌ర్శ‌క‌త్వ ం వ‌హిస్తున్నారు. వెట్ బ్రెయిన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. హైద‌రాబాద్‌ అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో సినిమా ప్రారంభ‌మైంది. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా, ర‌విరాజా పినిశెట్టి కెమెరా స్విచాన్ చేశారు. హ‌రీష్ శంక‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్, ఎస్ వి కృష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి, హీరోలు శ్రీకాంత్, త‌రుణ్ పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొని కొత్త కుర్రాడిని ఆశీర్వదించారు.

శివాజీరాజా మాట్లాడుతూ- 32 ఏళ్లుగా న‌టుడుగా నన్ను ఆద‌రిస్తున్నారు. అదే ఆద‌ర‌ణ , ప్రేమ మా అబ్బాయి విజ‌య్ రాజాకు అందించాల‌ని కోరుకుంటున్నా. చాలా క‌థ‌లు విన్నాక నాకు, మా అబ్బాయికి ఈ క‌థ‌ న‌చ్చి ఫైన‌ల్ చేశాం. ద‌ర్శ‌కుడు రెండేళ్లుగా ఈ స్క్రిప్టు పై ప‌ని చేస్తున్నారు. న‌ట‌శిక్ష‌కుడు వైజాగ్‌ స‌త్యానంద్ ఇన్‌స్టిట్యూట్ లో న‌ట‌న‌, డాన్స్, ఫైట్స్ లో శిక్ష‌ణ తీసుకున్నాడు. నేనున్న ఫీల్డ్ లోకే మా అబ్బాయి కూడా రావ‌డం హ్యాపీ. విజ‌య్ న‌న్ను స‌ల‌హా అడిగినప్పుడు.. నీకు ఎలా అనిపిస్తే అలా చేయి.. మెగాస్టార్ చిరంజీవిగారిలా క‌ష్ట‌ప‌డు, సూపర్ స్టార్ కృష్ణ గారిలా సేవాతత్పరత కలిగి ఉండు.. అని చెప్పాను… అని అన్నారు.

User Comments