అమెరికా భ‌య‌పెడుతున్న వేళ‌

Last Updated on by

అమెరికాలో తెలుగు ఆర్టిస్టుల సెక్స్ స్కాండ‌ల్ వ్య‌వ‌హారం ఓ కుదుపు కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ పోలీస్ మోదుగుమూడి దంప‌తుల్ని అరెస్టు చేసి విచార‌ణ చేప‌ట్ట‌డంతో ఊహాతీతం అనిపించే నిజాలు బ‌య‌టికొచ్చాయి. ఈ స్కాండ‌ల్‌లో ప‌లువురు క‌థానాయిక‌లు, యాంక‌ర్లు ప‌ట్టుబ‌డ్డార‌న్న ప్ర‌చారం సాగింది. అయితే ఇలాంటి ప్ర‌మాద‌క‌ర స‌న్నివేశంలో అమెరికాలో రెండోసారి మా అసోసియేష‌న్ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్ని నిర్వ‌హించేందుకు రెడీ అవుతుండ‌డం విశేషం.

ఈ వేడుక‌ల‌కు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌వుతార‌ట‌. తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్, ఫిలింస్టార్ ఈవెంట్స్ ఎల్ఎల్‌సి సంయుక్తంగా మా అసోసియేష‌న్‌తో క‌లిసి ఈ ఈవెంట్‌ని నిర్వ‌హిస్తార‌ట‌. తొలిసారి ఈవెంట్ నిర్వ‌హించిన‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి వేడుక‌కు విచ్చేసి స‌క్సెస్ చేశారు. ఆ ఈవెంట్ వ‌ల్ల కోటి నిధి సేక‌రించామ‌ని మా అధ్య‌క్షుడు శివాజీ రాజా తెలిపారు. ఈసారి మ‌హేష్ పేరుతోనూ మ‌రింత నిధిని ఆర్జించ‌నున్నారు. అయితే సెక్స్ స్కాండ‌ల్ వ‌ల్ల ఇంత ర‌చ్చ జ‌రిగాక అమెరికా వెళ్లేందుకు ముందుకొచ్చే క‌థానాయిక‌లు ఎవ‌రు? యాంక‌ర్లు ఎవ‌రు? వెళ్లేంత డేర్ ఉంటుందా? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

User Comments