Last Updated on by
రేప్ కేస్ ఉన్న వాళ్లంటే ఇప్పుడు రాక్షసుల కంటే హీనంగా చూస్తుంది న్యాయస్థానం కూడా. వాళ్ళకు కఠిన శిక్షలు పడాలంటుంది. ఇదిలా ఉంటే రేప్ కేస్ ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకోడానికి ఎవరైనా ముందుకొస్తారా..? ఓ హీరోయిన్ మాత్రం ధైర్యం చేసింది. ఆమె మదాలస శర్మ. తెలుగులో అల్లరి నరేష్ ఫిట్టింగ్ మాస్టర్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ. ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ ను పెళ్లి చేసుకుంది మదాలస. జులై 7నే వీరి వివాహం ఊటీలో జరగాల్సి ఉన్నా.. కొన్ని రోజుల క్రితం మహాక్షయ్ పై రేప్ కేసు నమోదు అయింది. బాలీవుడ్లో ఇది సంచలనంగా మారింది కూడా. నిందితుడుగా ఉన్న అతడిని విచారించేందుకు పోలీసులు పెళ్లి వేదిక వద్దకు చేరుకోవడంతో జరగాల్సిన పెళ్లి కాస్తా వాయిదా పడింది.
ఇంత జరిగిన తర్వాత కూడా మదాలస, మహాక్షయ్ ల పెళ్లి జులై 10న జరిగింది. ఇరు కుటుంబాలు స్నేహితులు కావడంతో వీళ్ల పెళ్లికి మార్గం సుగుమమైంది. కేసు నమోదైన తర్వాత కూడా మదాలసా కుటుంబం పెళ్లికి ఆపకపోవడానికి కారణం కూడా చిన్న నాటి నుంచి మహాక్షయ్ గురించి తనకు తెలుసు అని మదాలస చెప్పడమే.. పైగా నచ్చిన వాన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ పెద్దలు కూడా ఓకే చెప్పారు. మహాక్షయ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఈ మధ్యే ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. గర్భవతిని కూడా చేసాడని.. ఆ తర్వాత తనకు ఇష్టం లేకున్నా ఏవో మందులిచ్చి అబార్షన్ అయ్యేలా చేశాడని ఆరోపించింది. మహాక్షయ్ తల్లి.. మిథున్ భార్య యోగితా బాలి కూడా ఇందుకు సహకరించిందని.. నువ్వు ఎప్పటికీ నా కోడలివి కాలేవని తనను బెదిరించారని పోలీసులకు చెప్పింది ఆ యువతి. ఈ సమాచారం మేరకు మహాక్షయ్ పై రేప్ కేస్ నమోదైంది. ఇప్పుడు పెళ్లి కావడంతో మరి ఈ కేస్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలిక..!
User Comments