నాగచైతన్య- నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన `సవ్యసాచి` నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. నేటి సాయంత్రం హైదరాబాద్ ఔట్స్కర్ట్స్లో జరిగిన `సవ్యసాచి` ఈవెంట్లో స్పెషల్ గెస్టులు మాధవన్, విజయ్ దేవరకొండ అప్పియరెన్స్ హైలైట్. నిధి అగర్వాల్ గ్లామర్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సవ్యసాచి ఈవెంట్లో దేవరకొండ వేదికపై చేసిన పెర్ఫామెన్స్ మ్యాడీ అంతటి ప్రముఖుడి కితాబునందుకోవడానికి కారణమైంది. వేరొక హీరో ఈవెంట్లో ఇలా ఒక హీరో డ్యాన్స్ చేయడం అన్నది ఎంతో స్పోర్టివ్‌గా అనిపించిందని దేవరకొండకు కితాబిచ్చారు మ్యాడీ. ఈ వేదికపై మ్యాడీ మైండ్ బ్లో స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.
చైతూ తల్లిదండ్రులకు నేను బిగ్ ఫ్యాన్‌ని. చైతూ నటనలో పరిణతి ఉంది. హార్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నా.. చైతూ ఈ సినిమాతో పెద్ద విజయం అందుకుంటాడు… అని మ్యాడీ బ్లెస్ చేశారు. మైత్రి సంస్థ వరుసగా బ్లాక్బస్టర్లు కొడుతోంది. మరో విజయం తన ఖాతాలో వేసుకుంటుందని మ్యాడీ అన్నారు. సవ్యసాచి మూవీకి చందు మొండేటి రాసిన మాటలు ఎంతో బాగా నచ్చాయని ప్రశంసించారు. ఇప్పటికి తెలుగు పరిశ్రమకు వస్తున్నా. మళ్లీ వందరోజుల వేడుకలో కలుసుకుందామంటూ విష్ చేశారు.