సెక్స్ రాకెట్‌ని ఆప‌లేరెవ‌రూ

Last Updated on by

అమెరికా – చికాగో సెక్స్ రాకెట్ ప్ర‌కంప‌నాలు అంత తేలిగ్గా టాలీవుడ్‌ని వ‌దిలేట్టు లేవు. ఈ రాకెట్‌లో ప‌లువురు క‌థానాయిక‌ల పేర్లు వినిపించ‌డం స‌ర్వత్రా భ‌యాందోళ‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ముఖ్యంగా ఇందులో తెలుగ‌మ్మాయిలు ఉన్నార‌న్న వార్త ప్ర‌కంప‌నాలే రేపుతోంది. అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ పోలీస్ మ‌న క‌థానాయిక‌ల పేర్లు వెల్ల‌డించ‌క‌ముందే మ‌న వెబ్ మీడియాలు, యూట్యూబ్ చానెళ్లు ఇష్టానుసారం పేర్లు వెల్ల‌డిస్తూ క‌థ‌నాలు అల్లేయ‌డంపై తెలుగ‌మ్మాయి మాధ‌వీల‌త ఓ రేంజులో ఫైర‌య్యారు. ఈ తామ‌ర‌తంప‌ర‌గా వినిపిస్తున్న పుట్ట‌గొడుగుల్లాంటి వార్త‌ల‌పై త‌న‌దైన శైలిలో ఫిరంగులు పేల్చింది.

ఎఫ్‌బిలో మాధ‌వి ఫైరింగ్ ఇలా ఉంది. “ఇదో సంస్కారం లేని వాళ్ల ప‌ని. వినేవన్నీ నిజాలు కావు. ఆరోప‌ణ‌ల్లో బయటకి వచ్చేవి అన్నీ న్యాయం కాదు. ఎముకలు కుళ్లిన.. వయస్సు మళ్ళిన సోమరులు మీరు చావండీ. ఆడవాల్ల ఆత్మను చంపి శవాల మీద చిల్లరేరుకునే ముఖాలూ మనసే లేని మృగాలు.. మలినమైన అంతరాత్మలు మీరు“ అంటూ చెడామ‌డా క‌డిగేసింది. కుక్క‌ల వాగుడికి ఆన్స‌ర్ ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ప్రతి వాడి చుట్టూ తిరిగి నేను మంచిదాన్ని అని సర్టిఫికేట్ తెచ్చుకోను. అన్నిచోట్లా ఉండే వాటిని ఆప‌లేం.. అని ఖ‌రాకండిగా తేల్చి ప‌డేసింది మాధ‌వీల‌త‌.

User Comments