ఇండ‌స్ట్రీని చంపేస్తా!

Last Updated on by

అమెరికాలో సెక్స్ రాకెట్ పుణ్య‌మా అని తెలుగ‌మ్మాయిల పేర్లు ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి. మేం కూడా బాధితుల‌మే.. మ‌మ్మ‌ల్ని కూడా రాకెట్‌లోకి లాగాల‌ని ప్ర‌య‌త్నించారు ఈవెంట్ మ్యానేజ‌ర్లు. వీళ్ల ఆగ‌డాలు అన్నీ ఇన్నీ కావు… అంటూ ప‌లువురు క‌థానాయిక‌లు, న‌టీమ‌ణులు తీవ్రంగా వాపోయారు. మేం ఏ పాపం ఎరుగం అంటూ బిత్త‌ర‌చూపులు చూస్తున్నారు పాపం. అదంతా స‌రే.. అస‌లు ఇలాంటి బాధితుల జాబితాలో ఎవ‌రు ఎందుకు బ‌లైనా.. మాధ‌వీల‌త లాంటి డేరింగ్ గాళ్స్ మాత్రం అంతే ధీటుగా స్పందిస్తున్నారు. ఏటికి ఎదురెళుతూ పురుషాధిక్య ప్ర‌పంచాన్ని త‌మ‌దైన శైలిలో ప్ర‌శ్నిస్తున్నారు.

ఇండ‌స్ట్రీలో తెలుగ‌మ్మాయిల‌కు అవ‌కాశాలు రాకపోవ‌డంపై స్పందిస్తారా? అమెరికా రాకెట్ గురించి మీకు తెలిసిందేంటి? అని ప్ర‌శ్నిస్తే.. మాధ‌వీల‌త `మై ఫ‌స్ట్ షో`తో అన్న‌మాట ఇదీ.. `చంపేస్తా ఇండ‌స్ట్రీలో అంద‌రినీ` అంటూ ఘాటైన వ్యాఖ్య చేశారు. దీనిని బ‌ట్టి మాధ‌వీల‌త వంటి డేరింగ్ గాళ్ ఇంత ఘాటుగా స్పందించారంటే ఒక సాధాసీదా అమ్మాయి ఈ రంగుల ప్ర‌పంచంలో ప్ర‌వేశిస్తే తోడేళ్లు ఎలా తోడేస్తాయో, న‌క్క‌లు ఎలా వీల‌లు వేస్తాయో సింపుల్‌గా అర్థం చేసుకోవ‌చ్చు. 1000 గొడ్ల‌ను తిన్న రాబందు ఒక్క గాలివాన‌కు ప‌డిచచ్చిన చందంగా అమెరికాలో కిష‌న్ క‌ట‌క‌టాల పాలై ఎంద‌రికో గుణ‌పాఠం నేర్పాడ‌నే చెప్పాలి. ఇక‌పోతే ఎంద‌రో అమాయ‌క తెలుగ‌మ్మాయిల ఉసురు పోసుకున్న విటుడు కం సెక్స్ రాకెట్ నిర్వాహ‌కుడు కిష‌న్‌- చంద్ర‌క‌ళ దంప‌తులు ఇప్పుడు అమెరిక‌న్ పోలీస్ క‌స్ట‌డీలో ఘోరాతిఘోర‌మైన ట్రీట్‌మెంట్‌ని ఎదుర్కోబోతున్నారు. అన్న‌ట్టు అస‌లు మాధ‌వీల‌త ఇండ‌స్ట్రీలో అంద‌రినీ చంపేస్తాన‌ని వ్యాఖ్యానించ‌డం వెన‌క అస‌లు మ‌ర్మ‌మేంటి? కీప్ వాచ్&రీడ్‌ దిస్ స్పేస్ .. ఫ‌ర్ ఇంట్రెస్టింగ్ లీకేజీస్‌.. సూన్‌..

User Comments