బ్ర‌హ్మీ, అలీలా ఇప్పుడు కుద‌ర‌దు!!

Last Updated on by

రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందిన కొత్త చిత్రం వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి. రామ్ కార్తిక్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్ కామెడీ క‌థాంశంతో ఏబీటి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం నిర్మాణానంత‌ర‌ పనులు శరవేగంగా పూర్త‌వుతున్నాయి. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా క‌మెడియ‌న్లు ప్ర‌వీణ్ – మ‌ధు మీడియాతో ముచ్చ‌టించారు.

ప్ర‌వీణ్ – మ‌ధు మాట్లాడుతూ-“ఇది పూర్తి స్థాయి వినోదాత్మ‌క చిత్రం. ఇది పూర్తి హార‌ర్ చిత్రం కాదు. కామెడీతో పాటు ఎమోష‌న్ హైలైట్ గా ఉంటుంది. ఓ గ్రామం నేప‌థ్య ంలో సాగే ఈ చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ టీచ‌ర్ పాత్ర‌లో న‌టించారు. స‌త్తిగాడు.. పండుగాడు పాత్ర‌ల్లో ఆద్య ంతం పూర్తి కామెడీ క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. మా పాత్ర‌ల‌కు రాయ్ ల‌క్ష్మీతో క‌నెక్ష‌న్ ఏంటి అన్న‌ది తెరపైనే చూడాలి. కొత్త ద‌ర్శ‌కుడు.. కొత్త నిర్మాత అయినా నిర్మాణ విలువ‌ల ప‌రంగా ఎక్క‌డా రాజీకి రాకుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కిర‌ణ్ ర‌చ‌న సినిమాకి ప్ర‌ధాన బ‌లం. అలాగే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన కుర్రాళ్ల ప‌ని త‌నాన్ని మెచ్చుకోవాలి. అమ‌లాపురం స‌హా గోదావ‌రి ప‌రిస‌రాల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు“ అన్నారు.

టాలీవుడ్ లో కామెడీ త‌గ్గింది క‌దా? క‌మెడియ‌న్ల‌పై విమ‌ర్శ‌లొస్తున్నాయి. నేటిత‌రం క‌మెడియ‌న్ లు కొన్నాళ్ల త‌ర్వాత ఉంటారా ఉండ‌రా? అన్న విమ‌ర్శ కూడా ఉంది క‌దా? అని ప్ర‌శ్నిస్తే.. ప్ర‌వీణ్ , మ‌ధు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ఇది నిజ‌మే .. కాలంతో వచ్చిన మార్పు ఇది. బ‌య‌టి ప్ర‌పంచానికి సామాజిక మాధ్య‌మాలు, యూట్యూబ్ ల ద్వారా ప్ర‌తిభావంతులు తెలుస్తున్నారు. దాని వ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడ పోటీ పెరుగుతోంది. క‌మెడియ‌న్లు పెరుగుతున్నారు. ఇదివ‌ర‌క‌టిలా ఎవ‌రో కొంద‌రినే ఎంక‌రేజ్ చేసే ప‌రిస్థితి ప‌రిశ్ర‌మ‌లో లేదు. బ్ర‌హ్మానందం, అలీ, సునీల్ వంటి క‌మెడియ‌న్లు సుదీర్ఘ కాలం ఉండే ప‌రిస్థితి లేదు అని తెలిపారు.