`మధురవాడ` రెబ‌ల్స్ స్టోరి?

Last Updated on by

అర్జున్‌రెడ్డి, ఆర్‌.ఎక్స్‌.100 వంటి చిన్న సినిమాలు పెద్ద విజ‌యం సాధించ‌డంతో ఆ త‌ర‌హా చిన్న సినిమాల జోరు పెరిగింది. అదే కోవ‌లో కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ బ‌రిలో ఉన్నాయి. వీటిలో కొన్నిటి పోస్ట‌ర్లను దీపావ‌ళి కానుక‌గా మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

కన్నడలో `వాసు నాన్ పక్కా కమర్షియల్` ఫేం అజిత్ వాసన్ ఉగ్గిన తెరకెక్కిస్తున్న రెండో సినిమా `మధురవాడ`. నరైన్ సమర్పణలో డ్రామా క్వీన్, జస్వంత్ ఆర్ట్స్ పతాకంపై యాక్షన్ థ్రిల్లర్ కథతో తెలుగు, కన్నడ, తమిళ త్రి భాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బి.వి. కృష్ణారెడ్డి, ఎం వెంకటేష్ నిర్మాతలు. తెలుగులో సమంత, తమిళంలో కార్తీ చేతుల మీదుగా మధురవాడ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నూతన నటీనటులు నటించిన మధురవాడ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా పోస్ట‌ర్లు ఉత్కంఠ రేకెత్తించాయి. ఒక పోస్ట‌ర్‌లో ఖైదీల గెట‌ప్‌లో క‌నిపిస్తున్న యువ‌త‌రం విప్ల‌వాత్మ‌క పంథా క‌థాంశ‌మిద‌ని చెబుతోంది. ఎయిద‌ర్ స్లావేజ్ ఆర్ సేవేజ్ అన్న క్యాప్ష‌న్ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ దిలీప్ చక్రవర్తి, యోగి, ఎడిటర్ హర్ష. విక్రమ్ మోర్ ఫైట్స్ అందించారు.

User Comments