చ‌క్క‌ర్లు కొడుతున్న మాధురి దీక్షిత్

Last Updated on by

మాధురి దీక్షిత్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈమె పేరు చెబితే ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ షేక్ అయిపోతుంది. ముఖ్యంగా 90ల్లో ఈ భామ బాలీవుడ్ ను దున్నేసింది. ఆమె డాన్సుల‌తో.. అందంతో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా ఏలేసింది. మాధురి ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటున్నా కూడా ఆమె ఇమేజ్ మాత్రం ఇప్ప‌టికీ అలాగే ఉంది. ఆమె ఓకే అనాలే కానీ ఈ రోజుకి కూడా నిర్మాత‌లు ఆమె డేట్స్ కోసం క్యూ క‌డ‌తారు. ఆ మ‌ధ్య ఒక‌ట్రెండు సినిమాలు చేసినా కూడా మాధురి సెకండ్ ఇన్నింగ్స్ పై పూర్తిగా దృష్టి పెట్ట‌లేదు. ఇప్పుడు పిల్ల‌లు పెద్దోళ్లైపోతున్నారు. దాంతో బాగానే ఫోక‌స్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

చాలా ఏళ్ళ‌ తరువాత ఫుల్ లెంత్ పాత్ర‌లో మాధురి కనిపించబోతుంది
అది కూడా మరాఠీ సినిమాలో. ఆ సినిమాలో ఆమె ఒక త‌ల్లిగా అక్క‌గా అన్ని కోణాల్లో ఉండే పాత్ర‌లో న‌టిస్తుంది మాధురి దీక్షిత్. ఈ సినిమా టైటిల్ కూడా ఆస‌క్తిక‌రంగా ఉంది. అదే బకెట్ లిస్ట్. ఈ చిత్రంలో మాధురికి బైక్స్ అంటే పిచ్చి. ఇప్పుడు విడుద‌లైన షూటింగ్ పిక్స్ చూస్తుంటే సినిమాపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. మాధురి ఇందులో కాస్ట్లీ గా స్టైలిష్ గా ఉండే బైకులను న‌డిపింది. హార్లీ డేవిడ్ సన్ లాంటి ఆల్ట్రా మోడ్ర‌న్ బైకులను కూడా మాధురి డ్రైవ్ చేసింది. ఒక రేంజర్ ధరించే కాస్ట్యూమ్ వేసుకొని సినిమాలో అద్భుతంగా నటించారని చెబుతుంది చిత్ర యూనిట్. మొత్తానికి.. ఈ చిత్రం విడుద‌ల త‌ర్వాత ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతుందో..?

User Comments