మ‌ధుబాల విల‌నీ

Last Updated on by

రోజా సినిమాతో గొప్ప పెర్ఫామ‌ర్‌గా తెర‌పైకొచ్చిన అందాల క‌థానాయిక మ‌ధుబాల‌. మ‌ణిర‌త్న ం ద‌ర్శ‌క‌త్వ ం వ‌హించిన ఈ సినిమా విజ‌యంలో మ‌ధుబాల పాత్ర‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్థావించాలి. మ‌ధు ప్ర‌ముఖ న‌టి హేమ‌మాలిని క‌జిన్ గా గుర్తింపు ఉన్నా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ముద్ర వేయ‌డంలో పెద్ద స‌క్సెస‌య్యారు.

తొలి ప్ర‌య‌త్న‌మే ఓ ప్ర‌యోగం. క‌శ్మీర్ తీవ్ర‌వాదం నేప‌థ్య ంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో కొత్త‌గా పెళ్ల‌యిన వ‌ధువు తీవ్ర‌వాదులు చెర‌బ‌ట్టిన త‌న భ‌ర్త‌ను వెతుక్కుంటూ ఎలాంటి ప‌య‌నం సాగించింది? అన్న ఆస‌క్తిక‌ర కాన్సెప్టుతో మ‌ణి స‌ర్ అద్భుతంగా తెర‌కెక్కించారు. మ‌ధుబాల న‌ట‌న‌కు జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక మ‌ధుబాల కెరీర్‌లో ఎన్నో విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో న‌టించారు. శంకర్ ద‌ర్శ‌క‌త్వ ంలో జెంటిల్మెన్ చిత్రంలోనూ న‌టించారు. తమిళం, మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో కథానాయిక‌గా అనేక చిత్రాలు చేసి కొన్నేళ్ల క్రితం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. తెలుగులో సూర్య వెర్సెస్ సూర్య, నాన్నకు ప్రేమతో వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ప్ర‌స్తుతం బాబీ సింహ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘అగ్ని దేవ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర చేయనున్నార‌ని తెలుస్తోంది. త‌న కెరీర్‌లోనే ఇలాంటి పాత్ర చేయ‌డం ఇదే తొలిసారి.

User Comments