జ‌పాన్‌లో 17 కోట్ల మ‌గ‌ధీర‌

Last Updated on by

రామ్‌చ‌ర‌ణ్ – కాజ‌ల్ జంట‌గా ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన మ‌గ‌ధీర (2009) సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. నాయ‌కానాయిక‌ల‌ జ‌న్మ‌జ‌న్మ‌ల‌ ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆడియెన్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌కు గొప్ప పేరొచ్చింది. దాదాపు ప‌దేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా రీసెంటుగానే జ‌పాన్‌లో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కేవ‌లం ప‌ది రోజుల్లో 17 కోట్లు వ‌సూలు చేయ‌డం ఓ సెన్సేష‌న్‌.

ఈ విజ‌యం ద‌రిమిలా రామ్‌చరణ్‌ జపాన్‌ వాసులకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఈ స‌క్సెస్ నేప‌థ్య ంలో జ‌పాన్‌ అభిమానులు సినిమాలోని పాత్రల గెటప్‌లు, ప్లకార్డులతో థియేటర్లలో సందడి చేసిన‌ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో చరణ్‌ ఫేస్‌బుక్‌ వేదికగా స్పందిస్తూ.. థాంక్యూ జపాన్‌.. మీరు మాపై కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. మీ అభిమానాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఇలాంటి చ‌క్క‌ని సినిమాను నాకిచ్చినందుకు రాజ‌మౌళి గారికి థాంక్స్‌. మ‌గ‌ధీర‌ విడుదలై పదేళ్లు అయ్యిందంటే నమ్మలేకపోతున్నా అని ఆయన పేర్కొన్నారు. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత మ‌గ‌ధీర ఈ స్థాయి విజ‌యం సాధించ‌డం మార్కెట్‌కి ఆశావ‌హ దృక్ప‌థాన్ని పెంచుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇటీవ‌లే రంగ‌స్థ‌లం చిత్రంతో ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ అందుకున్న రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం కెరీర్ 12వ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

User Comments