10కోట్ల వ్యూస్ వైపు `2.ఓ` టీజ‌ర్‌

Last Updated on by

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – కిలాడీ అక్ష‌య్ కుమార్ కాంబో న‌టించిన 2.ఓ టీజ‌ర్ ప్ర‌చండ వేగంతో దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో సునామీ సృష్టిస్తోంది ఈ టీజ‌ర్‌. ది గ్రేట్ శంక‌ర్ విజ‌న్ ఏ రేంజులో ఉంటుందో మ‌రోసారి ఈ టీజ‌ర్ చూస్తేనే అభిమానుల‌కు అర్థ‌మైంది. 2.ఓ టీజ‌ర్ రిలీజైన కేవ‌లం 12 గంట‌ల్లోనే కోటి 50ల‌క్ష‌ల వ్యూస్‌తో రికార్డులు తిరగ‌రాసింది. త‌మిళ వెర్ష‌న్‌కు 5.9 మిలియ‌న్ వ్యూస్, తెలుగు వెర్ష‌న్‌కు 3.7 మిలియ‌న్ వ్యూస్‌, హిందీ వెర్ష‌న్ కు 5.1 మిలియన్ వ్యూస్ ద‌క్కాయి.

కేవ‌లం 24 గంట‌ల్లో 4కోట్ల వ్యూస్, 48 గంట‌ల్లో 8 కోట్ల వ్యూస్‌ని ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలు ఏర్పడ్డాయి. టీజ‌ర్ ఆద్యంతం క్రోమ్యాన్ వ‌ర్స‌స్ చిట్టీ వార్ ర‌క్తి క‌ట్టించ‌డంలో శంక‌ర్ బృందం స‌క్సెసైంది. అయితే ఈ టీజ‌ర్‌లో అక్ష‌య్ కుమార్ పాత్ర‌ను త‌క్కువ చేసి చూపించార‌న్న వాద‌న అత‌డి అభిమానుల్లో ఉంది. అయితే మునుముందు మ‌రిన్ని టీజ‌ర్ల‌తో ప్ర‌మోష‌న్ హీట్‌ని రాజేస్తార‌న‌డంలో సందేహం లేదు. న‌వంబ‌ర్‌లో రిలీజ్ కాబ‌ట్టి ఈరెండు నెల‌లు ప్ర‌చారంతో ఊద‌ర‌గొట్టేయ‌డం ఖాయం. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే కాదు, అటు హాలీవుడ్ బ‌డ్జెట్ల‌తోనే పోటీప‌డుతూ ఏకంగా 540 కోట్ల బ‌డ్జెట్‌ని ఈ సినిమాకి ఖ‌ర్చు చేశామ‌ని శంక‌ర్- లైకా బృందం ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది.

User Comments