మ‌హాల‌క్ష్మి కి అన్నీ భాష‌ల్లో అదే స‌మస్య‌?

బాలీవుడ్ క్వీన్ ని ద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో  ద‌టీజ్  మ‌హాల‌క్ష్మి టైటిల్ తో త‌మ‌న్నా ప్ర‌ధాన‌ పాత్ర‌లో సగానికి పైగా సినిమాను నీల‌కంఠ‌..బ్యాలెన్స్ షూటింగ్ `అ `ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ పూర్తిచేసారు. ఇక మిగ‌తా భాష‌ల్లో తెలుగు క‌న్నా ముందుగానే షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. కానీ సినిమా ఏ భాష‌లోనూ రిలీజ్ కాలేదు. తెలుగులో రిలీజ్ అవ్వ‌క‌పోవడానికి ప్ర‌ధాన కార‌ణం బిజినెస్ కాక‌పోవ‌డ‌మేన‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం సాగింది. అందువ‌ల్లే యూనిట్ క‌నీసం ప్ర‌చారం చేయ‌డానికి కూడా ముందుకు రాలేద‌ని క్లోజ్ సోర్సెస్ ద్వారా వినిపించింది.

తాజాగా ఈ సినిమాకు మిగ‌తా భాష‌ల్లోనూ అదే ప‌రిస్థితి అని తెలిసింది. ఏ భాష‌లోనూ పేరున్న హీరోయిన్ల‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డమే పెద్ద త‌ప్పిద‌మ‌ని ఇప్పుడు ఆలోచిస్తున్నారుట‌. అయినా చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకుంటే సుఖమేల. త‌మిళ్ లో కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌ల‌యాళంలో మంజిమా మోహ‌న్ క్వీన్ పాత్ర‌ను పోషించారు. కాజ‌ల్ మార్కెట్ ఇప్ప‌టికే ప‌డిపోయింది. కోలీవుడ్ అమ్మ‌డికి పెద్ద గా అభిమానులు కూడా లేరు. ఈ జాన‌ర్ సినిమాలకు మ‌ల‌యాళంలో స‌క్సెస్ రేటు త‌క్కువ‌. చిన్న ప‌రిశ్ర‌మ‌. డిస్ర్టిబ్యూష‌న్ ప‌రంగా ఇబ్బందులుంటాయి. ఇవ‌న్నీ క్వీన్ రిలీజ్ కు ఆటంకాలుగా మారాయ‌ని స‌మాచారం.