అమెరికా వ‌సూళ్లు 5కోట్లు

Last Updated on by

`మ‌హాన‌టి` సావిత్రిపై సింప‌థీ వ‌ర్క‌వుటైందా? సావిత్రి జీవితాన్ని వెండితెర‌పై చూసుకోవాల‌న్న ఆకాంక్ష వైజ‌యంతి మూవీస్‌కి క‌ల‌శం నింపుతోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇప్ప‌టివ‌రకూ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ లెక్క‌లేవీ బ‌య‌ట‌కు తెలియ‌లేదు కానీ, ఓవ‌ర్సీస్ నుంచి మాత్రం ప్ర‌తి డాల‌ర్ కౌంట్ తెలిసిపోతోంది. ఇదివ‌ర‌కే కేవ‌లం ప్రీమియ‌ర్ల రూపంలో 2కోట్లు వ‌సూలు చేసింద‌ని, హాఫ్ మిలియ‌న్ మార్క్‌ని చేరుతోంద‌న్న స‌మాచారం అందింది. తాజాగా అమెరికా నుంచి సుమారు 5కోట్ల($660,691) వ‌సూళ్లు సాధించింద‌న్న అప్‌డేట్ అందింది.

వైజ‌యంతి మూవీస్‌కి ఈ ఫ‌లితం ఊర‌ట‌నిచ్చేదే. తెలుగువారు ఎక్క‌డ ఉన్నా సావిత్రి బ‌యోపిక్‌ని ఆద‌రిస్తున్నారు. ప్ర‌పంచ దేశాల్లో ఆద‌ర‌ణ ద‌క్కింది. కీర్తి సురేష్ అస‌మాన న‌ట‌ప్ర‌తిభ‌, స‌మంత‌, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ల న‌ట‌నాభిన‌యం ఈ సినిమాక పెద్ద ప్ల‌స్‌. అంత‌కుమించి నాగ్ అశ్విన్ .. సావిత్రి పాత్ర‌ను తెర‌పై ఆవిష్క‌రించిన తీరు ప్ర‌శంస‌లు అందుకుంది. తొలిరోజు య‌థావిధిగా డివైడ్ టాక్ వ‌చ్చినా.. ఫ‌లితం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంద‌నే చెప్పాలి.

User Comments