భ‌ర‌త్ భ‌ర‌తం ప‌ట్టిన సావిత్రి

విడుద‌ల‌య్యేప్పుడు ఎవ‌రూ ఇంత‌గా మ‌హాన‌టి సంచ‌ల‌నాలు ఊహించ‌లేదు. ఏదో సావిత్రి జీవితం క‌దా.. ఆడుతుందిలే అనుకున్నారు కానీ రికార్డుల‌ను సైతం తిర‌గ‌రాస్తుంద‌ని మాత్రం ఎవ‌రూ అనుకోలేదు. ఇప్పుడు ఊహ‌కు అంద‌ని విధంగా ఈ చిత్ర దూకుడు సాగుతుంది. ఓవ‌ర్సీస్ లో అయితే ఏకంగా భ‌ర‌త్ అనే నేను రికార్డుల‌ను సైతం క‌దిలిస్తుంది అమ్మ‌. ఏ సినిమా అయినా అక్క‌డ విడుద‌లైన మూడు రోజుల త‌ర్వాత స్లో అవుతుంది. కానీ మ‌హాన‌టి మాత్రం వారం మొత్తం దూకుడు చూపించింది.

అక్క‌డ తొలి వారంలోనే ఏకంగా 1.86 మిలియ‌న్ వ‌సూలు చేసి టాప్ 10లో చోటు ద‌క్కించుకుంది. ఇది ఇలా ఉంటే విడుద‌లైన రెండో మంగ‌ళ‌వారం అక్క‌డ ల‌క్ష 38 వేల డాల‌ర్లు వ‌సూలు చేసింది మ‌హాన‌టి. భ‌ర‌త్ కు కూడా ఇది సాధ్యం కాలేదు. అక్క‌డ ల‌క్ష 30 వేల డాల‌ర్లు మాత్రమే వ‌సూలు చేసి మ‌హాన‌టి కంటే త‌ర్వాత ఉంది భ‌ర‌త్. ఇక రంగ‌స్థ‌లం ఈ విష‌యంలో మ‌హాన‌టి కంటే ముందుంది. ఈ చిత్రం రెండో మంగ‌ళ‌వారం ల‌క్ష 41 వేల డాల‌ర్లు వ‌సూలు చేసింది. ఫిదా అంద‌రికంటే ఎక్కువ‌గా ల‌క్షా 60 వేల డాల‌ర్లు వ‌సూలు చేసింది. ఇప్ప‌టికే అక్క‌డ 1.98 మిలియ‌న్ వ‌సూలు చేసి.. 2 మిలియ‌న్ కు చేరువ‌గా ఉంది. యుఎస్ లో కూడా సావిత్రి జీవితం ఇంత‌గా ఆద‌ర‌ణ పొందుతుండ‌టం నిజంగా ఆశ్చ‌ర్య‌మే. ఫుల్ ర‌న్ లో 2.5 మిలియ‌న్ కంటే ఎక్కువ‌గానే వ‌సూలు చేసేట్లు ఉంది ఈ చిత్రం.

User Comments