`సావిత్రి` కాస్ట్యూమ‌ర్స్ హెడ్ ఈయ‌నే

Last Updated on by

సావిత్రి బ‌యోపిక్‌ `మ‌హానటి` మేలో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఒక్కో అప్‌డేట్ హీట్ పెంచేస్తున్నాయి. ఇటీవ‌లే రిలీజైన ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్ అభిమానుల‌కు పిచ్చిగా న‌చ్చేసింది. సావిత్రి హీట్ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు త‌మిళంలోనూ అంతే ఇదిగా ఉంద‌న్న‌ది క్రిటిక్స్ చెబుతున్న మాట‌! వైజ‌యంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కోసం సావిత్రి చెన్న‌య్ ఇంటిని సెట్ రూపంలో వేశార‌ని ఇదివ‌ర‌కూ చెప్పుకున్నాం. ఆవిడ ఇంట్లో ఎలా ఉండేవారు? నాటి వాతావ‌ర‌ణం ఎలా ఉండేది.. య‌థాత‌థంగా సెట్‌లో తీర్చిదిద్దారని సావిత్రి కుమార్తె ఛాముండేశ్వ‌రి వెల్ల‌డించారు.

ఇక ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ డిపార్ట్‌మెంట్ అంతే స్ట్రాంగ్‌గా ప‌ని చేసింద‌న్న‌ది తాజా వార్త‌. నిఫ్ట్ డిజైన‌ర్, చెన్నై వాసి గౌరాంగ్ షా మ‌హాన‌టి కాస్ట్యూమ్స్ కోసం 100 మందితో అవిరామంగా వ‌ర్క్ చ‌శాన‌ని తెలిపారు. మూడ్స్‌ని బ‌ట్టి కాస్ట్యూమ్ డిజైన్ చేయాల్సి ఉంటుంద‌ని, సావిత్రి మూడ్‌ని బ‌ట్టి, నాటి కాలాదుల్ని ప‌రిశీలించి అవ‌స‌రం మేర ఈ డిజైన్స్ రూపొందించామ‌ని తెలిపారు. కాంచీపురం, గ‌ద్వాల్‌, వెంక‌ట‌గిరి వ‌గైరా బ్రాండ్ల‌ను నాడు సావిత్రి ధ‌రించేవార‌ని.. వాటిని ఆ పాత్ర కోసం ప్ర‌త్యేకంగా రూపొందించామ‌ని తెలిపారు. దేశ‌బ్యాప్తంగా 700 మంది చేనేత వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ల‌తో అనుబంధం సాగిస్తున్న ఆయ‌న కు ఏపీ, మ‌హారాష్ట్ర‌, త‌మిళ్‌నాడు, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, ప‌శ్చిమ బెంగాళ్ త‌దిత‌ర చోట్ల నెట్‌వర్క్ ఉంద‌ని నిఫ్ట్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇక తొలిసారి సినిమాకి ప‌ని చేసిన అనుభ‌వం మాత్రం `మ‌హానటి`తోనే సాధ్య‌మైంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

User Comments