రాజ‌మౌళిని ఫాలో అయిన నాగ్

Last Updated on by

సావిత్రి జీవితం అంటేనే ఎంద‌రో మ‌హానుభావుల క‌ల‌యిక‌. ఆమె ఒక్క‌రి జీవితం కాదు అది. ఆమెతో పాటే ఎన్నో జీవితాలు అందులో ముడిప‌డి ఉంటాయి. అందులో ఎన్టీఆర్ కూడా ఒక‌రు. ఎన్టీఆర్ లేకుండా సావిత్రి కెరీర్ ఊహించుకోవ‌డ‌మే క‌ష్టం. ఏఎన్నార్ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయినా ఎన్టీఆర్ న‌టించిన ప‌ల్లెటూరి పిల్ల‌తో ఎక్కువ‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ మ‌హాన‌టి. ఇక పాతాల భైర‌వి, మిస్స‌మ్మ‌, గుండ‌మ్మ‌కథ, మాయాబ‌జార్ లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ తోనే న‌టించింది సావిత్రి. అలాంటి ఎన్టీఆర్ లేకుండా సావిత్రి జీవితం ప‌రిపూర్ణం కాదు. అలాంటి మ‌హాన‌టుడి పాత్రను మ‌హాన‌టిలో ఎవ‌రు పోషిస్తున్నార‌నే విష‌యంపై ఎప్ప‌ట్నుంచో ఆస‌క్తి ఉంది.

ఏఎన్నార్, ఎస్వీఆర్, ఎల్వీ ప్ర‌సాద్, కేవీ రెడ్డి, చ‌క్ర‌పాణి.. ఇలా ఎంద‌రినో వెతికి పట్టుకున్న నాగ్ అశ్విన్.. ఎన్టీఆర్ పాత్ర కోసం మాత్రం ఎవ‌ర్నీ ప‌ట్టుకోలేక‌పోయాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ ను అడిగినా ఆయ‌న ఒప్పుకోలేదు. దాంతో యమ‌దొంగ త‌ర‌హాలో డిజిట‌ల్ ఎన్టీఆర్ ను సృష్టించాడు నాగ్ అశ్విన్. అప్పుడు రాజ‌మౌళి ఫాలో అయిన దారినే ఇప్పుడు నాగ్ ఫాలో అయ్యాడు. ఎన్టీఆర్ నిడివి చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. దానికోసం గ్రాఫిక్స్ టీం ప్ర‌త్యేకంగా ప‌నిచేసార‌ని.. ఇందులో ప్ర‌తీ చిన్న విష‌యంపై కూడా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడ‌ని తెలుస్తుంది. మ‌రి.. మ‌హాన‌టిలో మ‌హానటుడు ఎలా ఉండ‌బోతున్నాడో..?

User Comments