`మ‌హాన‌టి` ఓపెనింగ్ అదుర్స్‌

Last Updated on by

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `మ‌హాన‌టి` చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌సూళ్లు ఆశించిన స్థాయిలోనే ద‌క్కుతున్నాయి. అవార్డుల కేట‌గిరీ సినిమా, బాక్సాఫీస్ వ‌ద్ద ఏం చేస్తుందో.. అన్న టాక్ వినిపించినా.. సావిత్రిపై ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానం, సింప‌థీ వ‌ర్క‌వుటైంది. డే1లో ఈ సినిమా ఏకంగా 6 కోట్ల గ్రాస్ 3.27 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. షేర్ వివ‌రాలు ప‌రిశీలిస్తే..

ఈ సినిమాని థియేట్రిక‌ల్ రైట్స్‌ని 20 కోట్ల‌కు అమ్మ‌కాలు సాగించారు. అయితే డే 1లో ఆశాజ‌న‌కంగా 6కోట్ల గ్రాస్‌తో ఫ‌ర్వాలేద‌నిపించింది. నైజాం- 65 ల‌క్ష‌లు షేర్‌ను, 1.30కోట్ల గ్రాస్‌ను వ‌సూలు చేసింది. వైజాగ్ -18ల‌క్ష‌లు, తూ.గో జిల్లా-10ల‌క్షలు, ప‌.గో జిల్లా-6ల‌క్ష‌లు, కృష్ణ‌- 15ల‌క్ష‌లు, గుంటూరు- 9ల‌క్ష‌లు, నెల్లూరు-3ల‌క్ష‌లు, సీడెడ్‌- 14ల‌క్ష‌లు క‌లెక్ట్ చేసింది. నైజాం, ఏపీ క‌లుపుకుని 1.4కోట్ల షేర్‌, 2.5కోట్ల గ్రాస్ క‌లెక్ట‌య్యింది. అమెరికా నుంచి 1.87 కోట్ల షేర్‌, 3.4కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఓవ‌రాల్‌గా 3.27 కోట్ల షేర్‌, 5.9కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. థియేట్రిక‌ల్ రైట్స్ 20 కోట్ల మేర విక్ర‌యించారు కాబ‌ట్టి, ఆ మేర‌కు నెట్ లేదా షేర్ వ‌సూలు చేస్తే సినిమా సేఫ్ అయిన‌ట్టే. ఇక అటుపై ఏం వ‌చ్చినా లాభాల్లోకి వ‌స్తుంది. తొలి వీకెండ్ నాటికే 20కోట్ల మేర గ్రాస్‌ను ఈ సినిమా వ‌సూలు చేస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది.

User Comments