కీర్తిసురేష్ కాదు.. అభిన‌వ సావిత్రి..!

Last Updated on by

అభిన‌య సావిత్రిని మ‌రిపించ‌డం అంటే మాట‌లు కాదు. అప్ప‌ట్లో సావిత్రి న‌ట‌న అంటే ఆమె మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. ఎంత‌మంది న‌టీమ‌ణులు ఉన్నా కూడా మ‌హానటి మాత్రం సావిత్రి గారే. ఆమె పాత్ర చేయ‌డం అంటే ఇప్ప‌టి హీరోయిన్ల‌కు స‌వాలే. దాన్ని భ‌య‌ప‌డుతూనే స్వీక‌రించింది కీర్తిసురేష్. ఇక ఇప్పుడు ఈమె సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన విధానం చూసి ఇండ‌స్ట్రీ మొత్తం చ‌ప్ప‌ట్ల‌తో స్వాగ‌తిస్తుంది. ఎన్ని అవార్డులు ఉంటే అన్నీ ఈమెకే వ‌స్తాయ‌ని చెబుతున్నారంతా ముక్త‌ఖంఠంతో. అంత‌గా మ‌హాన‌టి పాత్ర‌ను ఓన్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టి వ‌ర‌కు కీర్తి చేసిన పాత్ర‌లు వేరు.. ఇక‌పై ఎన్ని సినిమాలు చేసినా కూడా అది వేరు.

మ‌హాన‌టి మాత్రం ఆమె కెరీర్ లో కలికితురాయిలా మిగిలిపోవ‌డం ఖాయం. ఇప్పుడు శ్రీ‌కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అని ఎలా చెబుతున్నామో.. సావిత్రి అంటే రాబోయే త‌రాల‌కు ఖచ్చితంగా కీర్తిసురేష్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అంత‌గా ఆ పాత్ర‌కు ప్రాణం పోసింది ఈ భామ‌. ఈ ఒక్క సినిమా చాలు.. ఆమె కెరీర్ ను మార్చేయ‌డానికి.. ఇంత‌కాలం చేసిన సినిమాల‌తో ఎంత ఇమేజ్ వ‌చ్చింది.. ఎంత క్రేజ్ తెచ్చుకుంది అనేది ప‌క్క‌న‌బెడితే సావిత్రి సినిమా చేసిన త‌ర్వాత ఆమెకు గౌర‌వం పెరుగుతుంది. మొత్తానికి అభిన‌య సావిత్రిని మ‌రిపించి అభిన‌వ సావిత్రి కూడా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటుంది.

User Comments