మ‌హాన‌టి తెచ్చిన ఆఫ‌రా ఇది?

Last Updated on by

అందాల క‌థానాయిక కీర్తి సురేష్ కెరీర్ సందిగ్ధ‌త గురించి టాలీవుడ్ లో ప్ర‌ముఖంగా చ‌ర్చ సాగుతోంది. ఈ అమ్మ‌డు తానొక‌టి త‌లిస్తే! అన్న చందంగా కెరీర్ ప‌రంగా వెన‌క‌బ‌డింద‌న్న మాట వినిపిస్తోంది. మ‌హాన‌టి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత కీర్తి న‌టించిన సినిమాలేవీ విజ‌యాలు సాధించ‌లేదు. స‌రైన క‌మ‌ర్షియల్ హిట్ ద‌క్క‌క కొంత డైలెమాలోనే ఉంది అమ్మ‌డు. ఆ క్ర‌మంలోనే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూసింద‌ని, అయితే రాజ‌మౌళి ఏదీ తేల్చ‌క‌పోవ‌డంతో కీర్తిలో డైలెమా అలానే ఉండిపోయింద‌ని వార్త‌లొచ్చాయి.

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అక్క‌డ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తోంది. బ‌దాయి హో ఫేం అమిత్ షా శ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఈ సినిమా స‌య్య‌ద్ అబ్ధుల్ ర‌హీమ్ అనే లెజెండ‌రీ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని హిందీతో పాటు అన్ని ద‌క్షిణాది భాష‌ల్లో అనువ‌దించి రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. అందుకే కీర్తిని ఆఫ‌ర్ వెతుక్కుంటూ వ‌చ్చింద‌ని చెబుతున్నారు. హిందీలో తెర‌కెక్కించి ఇత‌ర భాష‌ల్లోకి అనువ‌దించి రిలీజ్ చేస్తార‌ట‌. ఈ సినిమాపై కీర్తి చాలానే ఆశ‌లు పెట్టుకుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ ఆఫ‌ర్ రావ‌డానికి మ‌హాన‌టి ఇమేజ్ క‌లిసొచ్చింద‌ని ముచ్చ‌టించుకుంటున్నారు.

User Comments