మెల్‌బోర్న్‌లో `మ‌హాన‌టి` సునామీ

Last Updated on by

కీర్తి సురేష్ న‌టించిన `మ‌హాన‌టి` ఏ స్థాయి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 70 కోట్లు వ‌సూలు చేసింది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా ఈ స్థాయి విజ‌యం సాధించ‌డం అదో కొత్త‌ చ‌రిత్ర అనే చెప్పాలి. సావిత్రి పాత్ర‌లో కీర్తి అభిన‌యం అస‌మానం. అందుకే ఈ సినిమాని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు జ‌నం ప‌డి ప‌డీ చూశారు. అప్పుడు రివార్డులు, ప్ర‌శంస‌లు.. ఇప్పుడు అవార్డులు కూడాను..

క‌ఠోర‌మైన‌ కీర్తి శ్ర‌మ వృధా పోలేద‌ని ఈ స‌న్నివేశం చెబుతోంది. ఈ భామ‌కు దేశ‌, విదేశాల్లో అరుదైన గౌర‌వం ద‌క్కుతోంది. ఇప్ప‌టికిప్పుడు మెల్‌బోర్న్ నుంచి కీర్తికి ప్ర‌త్యేకంగా పిలుపొచ్చింది. ఆగ‌స్టు 10 నుంచి 22 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నఐఐఎఫ్ఎం అవార్డ్స్‌ -2018 వేడుక‌ల్లో మ‌హాన‌టి చిత్రానికి ప్ర‌త్య‌క ప్ర‌ద‌ర్శ‌న‌కు అర్హ‌త సాధించింది. ఇక్క‌డ ఈ సినిమా స్క్రీనింగుకి కీర్తి సురేష్ ఎటెండ్ కానుంది. ఇండియ‌న్ ఫిలింఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్ పేరుతో ఈ ఉత్స‌వాల్ని ఆస్ట్రేలియాలో స్థిర‌ప‌డిన ఎన్నారైలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ద‌క్షిణాది నుంచి కీర్తికి ఘ‌న‌మైన‌ ఆహ్వానం అందింది అంటే అవార్డు అందుకునే తిరిగి రానుంద‌న్న‌మాట‌. ఇదే ఉత్స‌వాల్లో హిచ్‌కీ ఫేం రాణీ ముఖ‌ర్జీ, స్ల‌మ్ డాగ్ హీరోయిన్ ఫ్రిదా పింటో త‌దిత‌రులు పాల్గొన‌నున్నారు. నామినీ లిస్ట్‌లో వీళ్లంతా ఉన్నారు కాబ‌ట్టి అవార్డులు అందుకోవ‌డానికే ఆస్ట్రేలియా వెళుతున్నార‌న్న‌మాట‌.

User Comments