మ‌హాన‌టి అద్భుతం..!

Last Updated on by

థియేట‌ర్స్ లో ఏడిపించిన సినిమాలు ఎప్పుడూ ఫెయిల్యూర్ కావు. ఇప్పుడు మ‌హాన‌టి కూడా ఇదే కోవ‌లోకి వ‌చ్చేలా క‌నిపిస్తుంది. ఈ చిత్రం మే 9న విడుద‌ల కానుంది. సావిత్రి జీవితం ఆధారంగా వ‌స్తోన్న సినిమా కాబ‌ట్టి ఖచ్చితంగా అంచ‌నాలు భారీగా ఉండ‌టం స‌హ‌జం. అయితే ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ ఎలా తీస్తాడా అనే ఆస‌క్తి మాత్రం అంద‌ర్లోనూ ఉంది. ఇప్పుడు ఆ అనుమానాలేవీ అక్క‌ర్లేదేమో..? ఎందుకంటే ఇప్పుడు సినిమా సెన్సార్ కూడా పూర్తైపోయింది. ఇది చూసిన త‌ర్వాత సెన్సార్ స‌భ్యులు ఏకంగా ఏడ్చేసారు. ఈ మ‌ధ్య ఏడిపించిన సినిమా ఇదేనంటూ.. సినిమా తీసిన విధానంపై ప్ర‌శంసల‌తో ముంచెత్తింది సెన్సార్ టీం.

మ‌రీ ముఖ్యంగా సావిత్రి జీవితంలో త్యాగాల‌ను.. ఆమె కెరీర్ చ‌ర‌మాంకంలో ప‌డిపోతున్న తీరును ద‌ర్శ‌కుడు అద్భుతంగా చూపించాడ‌ని తెలుస్తుంది. సినిమా ఖచ్చితంగా ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువ‌వుతుంద‌ని.. ఈ చిత్రంతో సావిత్రి జీవితం మ‌రోసారి క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుంద‌నే టాక్ వ‌చ్చింది. ప్ర‌తీ సినిమాకు ముందు ఇలాగే చెప్తారు క‌దా అనుకుంటే పొర‌పాటేనేమో..? ఎందుకంటే ఈ సారి మాత్రం సావిత్రి జీవితం కాబ‌ట్టి క‌చ్చితంగా తెలుగు వాళ్ల‌కు ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. మ‌రి సినిమా విడుద‌లైన త‌ర్వాత ప‌రిస్థితి ఎలా ఉంటుందో..?

User Comments