మ‌హాన‌టిని ఓవ‌ర్సీస్ లో ఆదరిస్తున్నారు

Last Updated on by

మ‌హాన‌టి విడుద‌లైన‌పుడు ఈ చిత్రాన్ని ఎవ‌రు చూస్తారు.. సావిత్రి జీవితంలో ఆస‌క్తి ఏం ఉంటుంది అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు క‌మెంట్ చేసారు. కానీ ఇప్పుడు ఆ విమ‌ర్శించిన నోళ్ల‌న్నీ మూత‌ప‌డ్డాయి. ఎంద‌కుంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అమ్మ అరాచ‌కాలు సాగుతున్నాయి క‌దా అందుకు. తొలిరోజు కాస్త స్లోగా స్టార్ట్ అయినా.. ఆ త‌ర్వాత మాత్రం మ‌హాన‌టి ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ లోనే 10 కోట్ల షేర్ అందుకున్న ఈ చిత్రం.. ఓవ‌ర్సీస్ లో అయితే ఏకంగా 1.5 మిలియ‌న్ అందుకుంది.

చిన్న సినిమాగా విడుద‌లైన మ‌హాన‌టికి ఈ రికార్డ్ చాలా పెద్ద‌ది. అక్క‌డ ఇప్ప‌టికీ స‌త్తా చూపిస్తూనే ఉంది మ‌హాన‌టి. నాగ్ అశ్విన్ టేకింగ్.. సావిత్రిగా కీర్తిసురేష్ న‌ట‌న సినిమాను మ‌రో స్థాయిలో నిల‌బెట్టాయి. దానికితోడు సావిత్రి జీవితం అనేస‌రికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ల‌కు ఎక్క‌డ లేని ఆస‌క్తి మొద‌లైంది. అందుకే ఈ చిత్రం అక్క‌డ అరాచకాలు చేస్తుంది. ఫుల్ ర‌న్ లో 2 మిలియ‌న్ ఈజీగా వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది మ‌హాన‌టి. ఇదే జ‌రిగితే తెలుగు సినిమాకు అక్క‌డ గోల్డెన్ పీరియ‌డ్ న‌డుస్తున్న‌ట్లే..!

User Comments