మ‌హాన‌టికి భారీ పోటీ.. ఎందుకీ వాయిదా

Last Updated on by

ఈ రోజుల్లో ఏ సినిమా కూడా చెప్పిన టైమ్ కు రావ‌డం లేదు. అలా వ‌స్తే వాళ్ల‌కు టైమ్ సెన్స్ లేదనుకుంటున్నారిప్పుడు. ఖచ్చితంగా చెప్పిన తేదీ కంటే వెన‌క్కి వెళ్తేనే వాళ్లు క‌రెక్ట్ గా ఉన్న‌ట్లు. ఇప్పుడు ఇండ‌స్ట్రీ కూడా ఇలాగే మారిపోయింది. ఇక్క‌డ ఇచ్చిన మాట‌.. చెప్పినతేదీ అస్స‌లు ప‌ట్టించుకోకూడ‌దు. అందుకే ఏ ద‌ర్శ‌కుడు కూడా త‌మ సినిమాల‌ను చెప్పిన టైమ్ కు పూర్తిచేయ‌డం లేదు. ఇది సెటైర్ అనుకోండి.. ఇంకేదైనా అనుకోండి.. కానీ ఇప్పుడు ఇండ‌స్ట్రీ మారిన తీరు మాత్రం ఇలాగే ఉంది. మ‌హానటి కూడా దీనికి మిన‌హాయింపు కాదు. ఈ చిత్రం కూడా చెప్పిన టైమ్ కి రావ‌డం లేదు. ముందు మార్చ్ 29న మ‌హాన‌టి అంటూ విడుద‌ల తేదీతో హంగామా చేసారు. కానీ కాలం క‌లిసి రాలేదు. ఈ చిత్ర సిజి వ‌ర్క్ పూర్తి కాలేదు. దాంతో ఈ సినిమాను మే 9కి పోస్ట్ పోన్ చేసారు. ఉగాది కానుక‌గా కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. కీర్తిసురేష్ మేక‌ప్ వేసుకుంటున్న‌ట్లు ఉన్న ఈ ఫోటో ఆక‌ట్టుకుంటుంది. మ‌హాన‌టి భారీ పోటీ మ‌ధ్యే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. మే 4న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా విడుద‌ల కానుంది. అదొచ్చిన వారం రోజుల్లోపే మ‌హాన‌టి రానుంది. ఇక మే 11న సాక్ష్యం విడుద‌ల కానుంది. ఈ రెండు సినిమాల మ‌ధ్య ఖచ్చితంగా మ‌హాన‌టికి భారీ పోటీ త‌ప్ప‌దు. కానీ స్ట్రాంగ్ కంటెంట్ ఉండ‌టంతో వెన‌క‌డుగు వేయ‌డం లేదు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని 20 కోట్ల‌తో తెర‌కెక్కిస్తున్నాడు. కీర్తిసురేష్.. స‌మంత‌.. మోహ‌న్ బాబు.. దుల్క‌ర్ స‌ల్మాన్.. నాగ‌చైత‌న్య లాంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో ఉంది. మ‌హాన‌టి అంత పోటీలో ఏం మాయ చేయ‌బోతుందో..?

User Comments