మ‌హాన‌టి డ‌మ్మీ.. ఇదీ ఒరిజిన‌ల్‌!

Last Updated on by

వినుడి వినుడి `మ‌హాన‌టి` అస‌లు క‌థ వినుడీ మ‌న‌సారా! అంటూ సావిత్రి జీవితాన్ని వెండితెర‌కెక్కించింది అశ్వ‌నిద‌త్ బృందం. అల్లుడు అశ్వ‌నిద‌త్ ద‌ర్శ‌క‌త్వంలో కుమార్తెలు స్వ‌ప్న‌ద‌త్‌, ప్రియాంక ద‌త్ నిర్మాత‌లుగా ఈ సినిమాని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అశ్వ‌నిద‌త్‌ తెర‌కెక్కించారు. అందుకోసం సావిత్రి జీవితంపై చాలానే ప‌రిశోధించారు. తెలిసింది కొంత‌, తెలియ‌నిది కొంత‌.. చెప్పింది ఇంత క‌లిపి సినిమా తీశారు. ఈ సినిమా బ్ర‌హ్మాందం ద‌ద్ద‌రిల్లే హిట్టు కొట్టింది. ఇంటా బ‌య‌టా .. దేశ‌విదేశాల్లో బాక్సాఫీస్‌ని చెండాడేసింది. అశ్వ‌నిద‌త్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. గ‌త కొంత‌కాలంగా ఫ్లాపుల బాట‌లో ఉన్న ద‌త్ క్యాంప్‌ని ఉత్సాహ‌ప‌రిచింది.

అయితే అచ్చులో బొమ్మ‌లాగా అస‌లు ఈ సినిమాలో సావిత్రి జీవితంలోని వాస్త‌వాల్ని చూపించారా? అంటే అస‌లు ఎవ‌రికీ ఏదీ తెలీదు కాబ‌ట్టి అవును నిజ‌మే కాబోలు అనుకున్నారంతా. తెర‌పై చూపించిందే వేదం అని డిక్లేర్ అయిపోయారు. పైపెచ్చు ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ వంటివారు సావిత్రికి, జెమిని గ‌ణేషన్‌కి భ‌క్తుడిగా మాట్లాడేసరికి ఈ సినిమాలో చూపించిందే నిజం అని న‌మ్మేశారంతా. అయితే అస‌లు నిజం వేరే ఉంది. సావిత్రి జీవితంలో ఎవ‌రికీ తెలియ‌ని చీక‌టి కోణం వేరే వేరేగా ఉంది. ఆ వేరే ఏంటి? అనేది ఇప్పుడు బ‌య‌ట‌పెట్టేందుకు ఓ పుస్త‌కం వ‌స్తోంది. ఇది బ‌యోపిక్‌ని మించి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టే పుస్త‌కం అని చెబుతున్నారు. `మ‌హాన‌టి` సినిమాపై మీ అభిప్రాయ‌మేంటి? అని కుర్ర‌జ‌ర్న‌లిస్టులు అడిగితే సీనియ‌ర్ పాత్రికేయులు, సావిత్రి స‌మ‌కాలికులు అయిన‌ ప‌సుపులేటి రామారావు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఈ చిత్రంలో అస‌లు ఒక్క నిజం చూపించ‌లేదు.. వీళ్లేం తీశారులే అనేశారాయ‌న‌. అప్పుడే ఆయ‌న వాల‌కం అర్థ‌మైంది. ఆ క్ర‌మంలోనే ఆయ‌న ఏకంగా సావిత్రి జీవితంపై `అద్భుత‌న‌టి సావిత్రి- తెర‌వెన‌క నిజాలు` పేరుతో పుస్త‌కం రాసి, ఏకంగా ఇప్పుడు పుస్త‌కావిష్క‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ప‌సుపులేటి ప్ర‌చుర‌ణ‌లో కాపీలు విక్ర‌యించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు ఈ పుస్త‌కంతో ఇంకెలాంటి ప్ర‌కంప‌నాలు సృష్టిస్తారో అన్న ఉత్కంఠ ప్ర‌స్తుతం ఫిలింవ‌ర్గాల్లో చ‌ర్చ‌కొచ్చింది. అంతేనా.. ఇందులో బ్ర‌హ్మాండం పగిలే అస‌లు నిజాలు చెబుతార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ప‌సుపులేటి ఇదివ‌ర‌కూ మెగాస్టార్ చిరంజీవి జీవితంపై ఆస‌క్తి రేకెత్తించే పుస్త‌కాలెన్నో ర‌చించారు.

User Comments