అప్పుడే పైర‌సి చేసేసారు

Last Updated on by

ఈ రోజుల్లో పైరసీ అనేది పెనుభూతంగా మారిపోయింది. విడుద‌లైన రోజే థియేట‌ర్ ప్రింట్స్ బ‌య‌టికి వ‌చ్చేస్తుంటే పాపం త‌ల‌లు కొట్టుకోవ‌డం త‌ప్ప మ‌రేం చేయ‌లేక‌పోతున్నారు నిర్మాత‌లు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా ఏదో ఓ రూపంలో పైర‌సీ బ‌య‌టికి వ‌చ్చేస్తుంది. ఇప్పుడు మ‌హాన‌టి కూడా దీనికి మిన‌హాయింపు కాదు. అలా ఉద‌యం సినిమా విడుద‌లైందో లేదో సాయంత్రానికే ప్రింట్ సిద్ధం చేసారు.

వీటిని చూసి అభిమానులు షాక్ అవ్వ‌డం త‌ప్ప ఇంకేం చేయ‌లేక‌పోతున్నారు. మ‌హాన‌టి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇలాంటి టైమ్ లో ఇలా పైరసీ అప్పుడే బ‌య‌టికి రావ‌డం అనేది దారుణం. అయితే ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్రం సావిత్రి జీవితాన్ని థియేట‌ర్స్ లో చూడ్డానికే ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌తార‌నే ధైర్యంతో ఉన్నారు.

User Comments