చుక్క‌ల్లో `మ‌హాన‌టి` శాటిలైట్

Last Updated on by

స‌క్సెస్ ఇచ్చే కిక్కు ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదిగో ఈ రేటు ఓ ప్ర‌త్య‌క్ష్య‌ సాక్ష్యం. వాస్త‌వానికి `మ‌హాన‌టి` ప్రివ్యూ చూసిన త‌ర‌వాత ఓ అగ్ర పంపిణీదారు ఈ సినిమా కొనేందుకు మొహం చాటేశార‌న్న ప్ర‌చారం సాగింది. స‌ద‌రు నిర్మాత `మెహ‌బూబా`ని 9 కోట్ల‌కు కొనుక్కుని నైజాంలో రిలీజ్ చేస్తే డిజాస్ట‌ర్ ఫ‌లితంతో మొత్తం చాప చుట్టుకుపోవ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. రెండు రోజుల గ్యాప్‌తో రిలీజైన `మ‌హాన‌టి`, `మెహబూబా` చిత్రాల్లో ఒక‌టి హిట్‌… రెండోది ప్లాప్‌. ఈ ఫ‌లితం స‌ద‌రు నైజాం పంపిణీదారు కం నిర్మాత‌కు మింగుడుప‌డ‌డం లేదుట‌. త‌న జ‌డ్జిమెంట్ ఇంత దారుణంగా ఫ్లాప‌వుతుంద‌ని అత‌గాడు ఊహించ‌లేదుట‌. మొత్తానికి మెహ‌బూబా కొట్టిన దెబ్బ‌కు దిమ్మ తిరిగింద‌ని చెబుతున్నారు.

ఇదంతా ఇలా ఉండ‌గానే.. `మ‌హాన‌టి` మాత్రం ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఈ సినిమా కేవ‌లం ఓవ‌ర్సీస్ నుంచే 15కోట్ల మేర  వ‌సూలు చేస్తుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల వ‌సూళ్లు బోన‌స్‌. ఇప్పుడు శాటిలైట్ రూపంలో ఏకంగా 11కోట్లు నిర్మాత ద‌క్కించుకోనున్నారని తెలుస్తోంది. ప్ర‌ఖ్యాత జీటీవీ మ‌హాన‌టి శాటిలైట్‌కి 11కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంద‌ని తెలుస్తోంది.  వైజ‌యంతి మూవీస్ హిస్ట‌రీలోనే చెప్పుకోద‌గ్గ సినిమాగా మ‌హాన‌టి పేరు చిర‌స్థాయిగా నిలిచిపోనుంది.

User Comments