మ‌హాన‌టికి టాక్స్ ఫ్రీ ఇచ్చిన బాబు గారు

Last Updated on by

మ‌హాన‌టి.. ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో వ‌చ్చిన మంచి సినిమా. అందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు. విజ‌యంతో పాటు ప్ర‌శంస‌లు కూడా అందుకుంటుంది మ‌హాన‌టి. ఇప్ప‌టికే ఈ చిత్రం 34 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చింది. మ‌రో 6 కోట్లు ఈజీగా తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది ఈ చిత్రం. మూడో వారాంతంలో కూడా హౌజ్ ఫుల్స్ తోనే సినిమా ముందుకెళ్తుంది. ఈ జోరు చూస్తుంటే 40 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తుంది. ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రానికి ప‌న్ను మిన‌హాయింపు ఇస్తామంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వెలువ‌డుతున్నాయి.

మ‌హాన‌టికి ట్యాక్స్ మిన‌హాయింపు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని కొంద‌రు ఓపెన్ గానే చెబుతున్నారు. భారీ బ‌డ్జెట్ సినిమా కాక‌పోవ‌డం ఓ కార‌ణం అయితే.. మంచి సినిమానే అయినా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమానే కాబ‌ట్టి ట్యాక్స్ మిన‌హాయింపు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని కొంద‌రి భావ‌న‌. ఒక‌వేళ ట్యాక్స్ మిన‌హాయింపు కానీ ఇస్తే మ‌హాన‌టికి క‌నీసం 5 కోట్లు వెన‌క్కి వ‌స్తాయి. ఎందుకంటే ఎంట‌ర్ టైన్మెంట్ ట్యాక్స్ ఇప్పుడు 28 శాతం ఉంది. ఆ లెక్క‌ల్ని బ‌ట్టి చూస్తే ఏపీలో సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌తో పోలిస్తే 4 నుంచి 5 కోట్లు వెన‌క్కి వ‌స్తాయి. అయితే త‌మ సినిమాకు ప‌న్ను మిన‌హాయింపు అవ‌స‌రం లేదు.. ఆ మొత్తం కూడా అమ‌రావ‌తికి ఇచ్చేయండి అంటూ మ‌హాన‌టి నిర్మాత అశ్వినీద‌త్ చెప్ప‌డం విశేషం.

User Comments