బ్లాక్ బ‌స్ట‌ర్ కా మా..!

Last Updated on by

సాధార‌ణంగా బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అంటారు క‌దా.. కానీ ఇక్క‌డ సావిత్రి జీవితం కాబ‌ట్టి మా అంటున్నాం. అంతే మిగిలిందంతా సేమ్ టూ సేమ్. ఈ రోజుల్లో పెట్టిన డ‌బ్బులు వెన‌క్కి వ‌స్తే చాలు అనుకుంటున్నారు నిర్మాత‌లు. కానీ మ‌హాన‌టి మాత్రం రెండున్న‌ర రెట్లు ఎక్కువ తీసుకొచ్చింది. 18 కోట్ల‌కు హ‌క్కుల్ని అమ్మితే ఏకంగా 42 కోట్లకు పైగా షేర్ వ‌సూలు చేసింది మ‌హాన‌టి. ఆరు వారాలు థియేట‌ర్స్ లో విజ‌యవంతంగా ఆడేసింది ఈ చిత్రం. ఈ మ‌ధ్య కాలంలో రంగ‌స్థ‌లం త‌ర్వాత అంత‌గా బాక్సాఫీస్ ను దున్నేసింది ఈ చిత్రం.

మ‌హాన‌టి ఫైన‌ల్ రన్ లో 42 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. తొలి వారంలో 19 కోట్లు రాబ‌ట్టిన మ‌హాన‌టి.. రెండోవారంలో మ‌రో 10 కోట్లు తీసుకొచ్చింది.. ఇక మూడో వారంలో 4 కోట్లు.. నాలుగు, ఐదు, ఆరు వారాల్లో మ‌రో ప‌ది కోట్లు వ‌సూలు చేసింది. నైజాంలో.. ఓవ‌ర్సీస్ లో 10 కోట్లకు మించి షేర్ అందుకుంది ఈ చిత్రం. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమా సంస్థ నిర్మించింది. కీర్తిసురేష్ న‌ట‌న చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. మ‌హాన‌టి వ‌చ్చిన త‌ర్వాతే నా పేరు సూర్య‌.. నేల‌టికెట్.. అమ్మ‌మ్మ‌గారిల్లు.. ఆఫీస‌ర్.. రాజుగాడు లాంటి సినిమాల‌న్నీ ఈ చిత్రం దెబ్బ‌కు ప‌డుకున్నాయి. మొత్తానికి సావిత్ర‌మ్మ దూకుడు అలా ముగిసింది అన్న‌మాట‌.

User Comments