మ‌హాన‌టి సంచ‌లనాల‌కు అడ్డెక్క‌డ‌..?

Last Updated on by

ఏ సినిమాను కూడా త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌దు. వేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మ‌హాన‌టిని చూస్తుంటే అంద‌రికీ అనిపిస్తుంది ఇదే. లేక‌పోతే మ‌రేంటి.. మ‌హాన‌టి దూకుడు ముందు ఇప్పుడు రికార్డుల‌న్నీ మోక‌రిల్లుతున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న క‌లెక్ష‌న్లు చూసి ఈ చిత్రం ఎక్క‌డ ఆగుతుందో అంచ‌నా వేయ‌డం కూడా క‌ష్ట‌మైపోతుంది. థియేట‌ర్స్ కు పెద్ద‌వాళ్లంతా క్యూ క‌డుతున్న వేళ‌.. క‌న్నుమూసిన 40 ఏళ్ల త‌ర్వాత కూడా సావిత్రి ఇమేజ్ ఇంత కూడా త‌గ్గ‌లేద‌ని తెలుస్తున్న వేళ‌.. కీర్తిసురేష్, నాగ్ అశ్విన్ క‌లిసి మ్యాజిక్ చేసిన వేళ‌.. మ‌హాన‌టి సంచ‌ల‌నం రోజుకో విధంగా సాగుతుంది.

రెండో వారాంతంలో అయితే మ‌హాన‌టి ఏకంగా 5 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే 10 రోజుల్లో 25 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఈ చిత్ర దూకుడు చూస్తుంటే ఈజీగా 40 కోట్ల షేర్ వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. రెండో వారంలో మ‌హాన‌టికి 140 స్క్రీన్స్ పెంచేసారు. ఇక ఓవ‌ర్సీస్ లో కూడా స్క్రీన్స్ సంఖ్య పెంచేసారు. అక్క‌డ షేరింగ్ ప‌ద్ద‌తిలో ఇప్ప‌టికే 2.2 మిలియ‌న్ దాటేసింది. చూస్తుంటే అక్క‌డ 3 మిలియ‌న్ కూడా అందుకునేలా క‌నిపిస్తుంది. ఎందుకంటే మ‌రో రెండువారాలు సినిమాలు లేవు. మే 25న నేల‌టికెట్ వ‌చ్చేంత వ‌ర‌కు మ‌హాన‌టికి పోటీ లేదు. నేల‌టికెట్ వ‌చ్చినా కూడా మ‌హాన‌టికి కుటుంబ ప్రేక్ష‌కుల అండ‌దండ‌లు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

User Comments